
తాజా వార్తలు
హంసలదీవి(కోడూరు), న్యూస్‌టుడే: సముద్రంలో కొట్టుకుపోతున్న ముగ్గురు మహిళలను మాజీ సర్పంచి కొక్కిలిగడ్డ సముద్రాలు కాపాడిన సంఘటన హంసలదీవి వద్ద సాగరతీరంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. కార్తిక మాసం కావడంతో రోజూ సాగరసంగమ తీరానికి సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. గురువారం కూడా అధిక సంఖ్యలో వచ్చారు. విజయవాడ నుంచి వచ్చిన ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు స్నానాలు చేస్తూ... పోలీసులు తెలిపిన నిర్దేశిత ప్రదేశాన్ని దాటి సముద్రంలోకి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులు గమనించి కేకలు వేయడంతో సమయానికి అక్కడే ఉన్న హంసలదీవి మాజీ సర్పంచి, మత్స్యకారుడైన కొక్కిలిగడ్డ సముద్రాలు వెంటనే సముద్రంలోకి దూకి వారిని రక్షించాడు. దీంతో వియజవాడకు చెందిన విజయదుర్గ, గౌరి, లక్ష్మి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఊపిరాగిపోతుందనుకునే సమయానికి వచ్చి ‘ఆపద్భాందవుడిలా..’ కాపాడావయ్యా..! అంటూ వారు, వారి కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో పాటు మెరైన్ పోలీసు సిబ్బంది నరసయ్య, కోడూరు పోలీసులు, పాలకాయతిప్ప ఆటో డ్రైవర్లు ప్రమాదాలకు గురైన వారిని కాపాడుతున్నారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఉతికి ఆరేశారు
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
