close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎల్‌ఐసీ-హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌


 

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)కి చెందిన హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఫ్‌ఎల్‌) దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ● అసిస్టెంట్‌ మేనేజర్‌ (లీగల్‌)

మొత్తం ఖాళీలు: 35 అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ (లా) ఉత్తీర్ణత, కంప్యూటర్‌ స్కిల్స్‌. వయసు: 23-30 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా. పరీక్షతేది: 2020 జనవరి 27. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరితేది: డిసెంబరు 16.

వెబ్‌సైట్‌: https://www.lichousing.com/

ఎన్‌ఐఈపీఎండీ, చెన్నై

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌) (ఎన్‌ఐఈపీఎండీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 18. పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, రిహాబిలిటేషన్‌ ఆఫీసర్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌, తదితరాలు. అర్హత: పోస్టుని అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివరితేది: డిసెంబరు 23.

వెబ్‌సైట్‌: http://www.niepmd.tn.nic.in/

ప్రవేశాలు

నీట్‌ యూజీ-2020

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)-2020 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ● నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ (యూజీ))-2020

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌, తత్సమాన ఉత్తీర్ణత. వయసు: 17-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: పెన్‌ అండ్‌ పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా. పరీక్షతేది: మే 03, 2020. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరితేది: డిసెంబరు 31.

వెబ్‌సైట్‌: https://ntaneet.nic.in/

వాక్‌-ఇన్స్‌

ఎన్‌డీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

ర్నాల్‌ (హరియాణ)లోని ఐకార్‌-నేషనల్‌ డెయిరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌డీఆర్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. మొత్తం ఖాళీలు: 14 పోస్టులు: యంగ్‌ ప్రొఫెషనల్‌, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఎంటెక్‌ ఉత్తీర్ణత, పరిశోధన అనుభవం.

వాక్‌ఇన్‌తేది: డిసెంబరు 10 నుంచి 23 వరకు.

http://www.ndri.res.in/

పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా www.eenadupratibha.net చూడవచ్ఛు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.