close

తాజా వార్తలు

కోల్‌కతాకు హైదరాబాద్‌ లక్ష్యం 182

కోల్‌కతా: నిషేధం తర్వాత భారత గడ్డపై ఆడుతున్న తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ సారథి డేవిడ్‌ వార్నర్‌ (85; 53 బంతుల్లో 9×4, 3×6) రెచ్చిపోయాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత అర్ధశతకం బాదేశాడు. మునుపటిలా అతడు విధ్వంసం సృష్టించలేదు. నిలకడగా ఆడుతూ ప్రశాంతంగా పరుగుల వరద పారించాడు. చూడచక్కని సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. అతడికి తోడుగా ఓపెనర్‌గా వచ్చిన జానీ బెయిర్‌ స్టో (39; 35 బంతుల్లో 3×4, 1×6) స్ట్రైక్‌ రొటేట్‌ చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 118 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన ఆల్‌రౌండర్‌ విజయ్ శంకర్‌ (40; 24 బంతుల్లో 2×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో హైదరాబాద్‌ 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆండ్రూ రసెల్‌ 2 వికెట్లు తీశాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.