close

తాజా వార్తలు

రోజర్ బిన్నీ.. 1983 ప్రపంచకప్‌ హీరో

నేడు 64వ పుట్టిన రోజు జరుపుకొంటున్న భారత పేసర్‌

రోజర్‌ బిన్నీ.. ఈ పేరు ఇప్పటి భారత క్రికెట్‌ అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1983 ప్రపంచకప్‌ చూసిన వారికి తప్పకుండా తెలిసే ఉంటుంది. కపిల్‌దేవ్‌ సారథ్యంలోని టీమిండియా తొలిసారి ప్రపంచకప్‌ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించిన మీడియం పేసర్‌ బిన్నీ. ఆ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి టీమిండియాని సెమీస్‌కు చేర్చిన ఘనత అతడిది. మెగాటోర్నీలో అత్యధిక వికెట్లు (18) తీయడంతో పాటు లార్డ్స్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో క్లైవ్‌లాయిడ్‌ (8; 17 బంతుల్లో 1x4) లాంటి మేటి బ్యాట్స్‌మెన్‌ని ఔట్‌ చేశాడు. ఇంతటి చరిత్ర కలిగిన రోజర్‌ బిన్నీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అతడి గురించి కొన్ని విశేషాలు మీకోసం..

 1955 జులై 19న బెంగళూరులో పుట్టిన రోజర్‌ బిన్నీ కర్ణాటక ఆటగాడిగా క్రికెట్‌ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. భారత క్రికెట్‌లో ఆడిన తొలి ఆంగ్లో ఇండియన్‌గా రికార్డు సృష్టించాడు. అతడు పాఠశాల స్థాయిలోనే ఫుట్‌బాల్‌, హాకీ క్రీడలు  ఆడాడు.
 1979లో బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్‌పై తొలి టెస్టు ఆడిన అతడు ఇమ్రాన్‌ఖాన్‌, సర్ఫరాజ్‌ నవాజ్‌ లాంటి మేటి బౌలర్లను ఎదుర్కొని అరంగేట్రం మ్యాచ్‌లోనే(46) పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 
 1983 ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక వికెట్లు(18) సాధించిన క్రికెటర్‌గా నిలవడంతో పాటు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
 రోజర్ బిన్నీ కర్నాటక రంజీ జట్టులో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా సేవలందించడంతో పాటు బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో ఆకట్టుకొన్నాడు. 
 కర్ణాటక తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌గా తొలిరోజుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేరళతో జరిగిన కీలక మ్యాచ్‌లో 211 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ జట్టు తరఫున మొత్తం 12 శతకాలు, 21 అర్ధశతకాలు  సాధించడంతో పాటు 112 వికెట్లు తీశాడు.
• బిన్నీ కోచింగ్‌ సారథ్యంలోనే 2000 ఏడాదిలో టీమిండియా అండర్‌ 19 ప్రపంచకప్‌ గెలిచింది. యువరాజ్‌సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌ లాంటి క్రికెటర్లు అతడి నేతృత్వంలోనే వెలుగులోకి వచ్చారు. 
• 2012లో రోజర్‌ బిన్నీ జాతీయ జట్టుకు సెలెక్టర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌లో కీలక బాధ్యతలు అందిస్తున్నాడు.
 రోజర్‌ బిన్నీ కుమారుడు స్టువర్ట్‌ బిన్నీ కూడా భారత జట్టు ఆటగాడే. 
• టీమిండియా తరఫున మొత్తం 27 టెస్టులు ఆడిన అతడు 47 వికెట్లు తీసి 830 పరుగులు చేశాడు. అలాగే 72 వన్డేలాడి 77 వికెట్లతో పాటు 629 పరుగులు చేశాడు.

-ఇంటర్నెట్‌డెస్క్‌  ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.