Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144605
            [news_title_telugu_html] => 

సన్‌రైజర్స్‌కొత్తసహాయ కోచ్‌ ఎవరో తెలుసా?

[news_title_telugu] => సన్‌రైజర్స్‌కొత్తసహాయ కోచ్‌ ఎవరో తెలుసా? [news_title_english] => Sunrisers Hyderabad bring in Brad Haddin as their assistant coach [news_short_description] => ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌లో విజయవంతమైన జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఒకటి. 2020 సీజన్‌కు సరికొత్తగా ముందుకొచ్చేందుకు ఆ ఫ్రాంచైజీ సిద్ధమైంది. ఇంతకు ముందే ప్రధాన కోచ్‌గా ట్రెవర్‌ బేలిస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఆ హైదరాబాద్‌.... [news_tags_keywords] => Sunrisers Hyderabad,Brad Haddin,KKR,Trevor Bayliss [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 21:38:57 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సన్‌రైజర్స్‌కొత్తసహాయ కోచ్‌ ఎవరో తెలుసా? - Sunrisers Hyderabad bring in Brad Haddin as their assistant coach - EENADU
close

తాజా వార్తలు

సన్‌రైజర్స్‌కొత్తసహాయ కోచ్‌ ఎవరో తెలుసా?

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌లో విజయవంతమైన జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఒకటి. 2020 సీజన్‌కు సరికొత్తగా ముందుకొచ్చేందుకు ఆ ఫ్రాంచైజీ సిద్ధమైంది. ఇంతకు ముందే ప్రధాన కోచ్‌గా ట్రెవర్‌ బేలిస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న హైదరాబాద్‌ తాజాగా మరో మాజీ క్రికెటర్‌ను సహాయ బృందంలోకి తీసుకొంది. సిమోన్‌ హెల్మట్‌ స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడ్‌ హడిన్‌ను సహాయ కోచ్‌గా తీసుకుందని తెలుస్తోంది.

ఇంగ్లాండ్‌ను ప్రపంచ విజేతగా నిలిపిన ట్రెవర్‌ బేలిస్‌ 2012-2015 వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కోచ్‌గా ఉన్నారు. 2012, 2014లో ఆ జట్టు ఐపీఎల్‌ టైటిల్‌ సాధించింది. 2011లో హడిన్‌ కేకేఆర్‌కు ఆడాడు. బిగ్‌బాష్‌లో సిడ్నీ సిక్సర్‌కు హడిన్‌ సారథిగా ఉన్నప్పుడు బేలిస్‌ కోచ్‌గా పనిచేశారు. వీరిద్దరి మధ్య సమన్వయం బాగుండటంతో ఈ సారి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మంచి విజయాలు సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. హడిన్‌ గతంలో ఆస్ట్రేలియా-ఏ కోచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆసీస్‌ జాతీయ జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా రెండేళ్లు ఉన్నారు. ఇక వీవీఎస్‌ లక్ష్మణ్‌, ముత్తయ్య మురళీధరన్‌ స్థానాలకు ఢోకా లేదని తెలుస్తోంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.