close

తాజా వార్తలు

గుర్రాలు కిందపడ్డాయని విధ్వంసం చేశారు..

బెంగళూరు: రేసు గుర్రాలు అదుపుతప్పి కింద పడిపోవడంతో బెంగళూరు టర్ఫ్‌ క్లబ్‌లో కొందరు పంటర్లు (పందెం రాయుళ్లు) విధ్వంసం సృష్టించారు. తాము పందెం కాసిన నగదును తిరిగి చెల్లించాలని అక్కడి ఫర్నిచర్‌, టీవీ, క్యాబిన్‌ను నాశనం చేశారు. శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనతో శీతకాలం రేసులన్నీ నిలిపివేశామని టర్ఫ్‌ మేనేజర్‌ ఒకరు తెలిపారు.

రేసులో పరుగెడుతున్న ఓ గుర్రం హఠాత్తుగా అదుపుతప్పి కిందపడటంతో కాలు విరిగింది. ఆ వెనకాల వస్తున్న మరో రెండు గుర్రాలు గాయపడ్డ గుర్రాన్ని ఢీకొని కిందపడ్డాయి. ఫలితంగా ముగ్గురు జాకీలు కిందపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆగ్రహం చెందిన పంటర్లు తమ డబ్బులు తిరిగి చెల్లించాలని ఆందోళన చేశారన్నారు. క్యాబిన్‌, ఫర్నిచర్‌ టీవీ సెట్లను విరగొట్టి విధ్వంసం సృష్టించారని వెల్లడించారు. ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై ఐపీసీ సెక్షన్‌ కింద కేసు పెట్టామన్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.