close

తాజా వార్తలు

14 బంతుల్లోనే 50: బద్దలైన రికార్డు

ముంబయి: మేఘాలయ ఆల్‌రౌండర్‌ అభయ్‌ నేగి అరుదైన రికార్డు సాధించాడు. దేశవాళీ టీ20 క్రికెట్‌ టోర్నీలో వేగంగా అర్ధశతకం బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సయ్యద్‌ ముస్తాఫ్ అలీ ట్రోఫీలో మిజోరంపై అతడు 14 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తిచేశాడు. దీంతో దేశవాళీలో రాబిన్‌ ఉతప్ప పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతేకాకుండా కేఎల్ రాహుల్‌ రికార్డు కూడా సమం చేశాడు. భారత్‌లో జరిగిన టీ20ల్లో వేగంగా అర్ధశతకం బాదిన ఆటగాడిగా రాహుల్‌ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు దిల్లీ క్యాపిటల్స్‌పై ఈ ఘనత సాధించాడు. 

మిజోరం బౌలర్లపై రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగిన అభయ్‌ ఐపీఎల్ 2020 వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని అందరూ భావిస్తున్నారు. అభయ్‌తో పాటు రవితేజ (53) కూడా అర్ధశతకం బాదడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన మేఘూలయ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన మిజోరం రెండు వికెట్లు కోల్పోయి 182 పరుగులే చేసింది. మిజోరం బ్యాట్స్‌మెన్‌లో తరువార్ కోహ్లీ (90), పవన్‌ (72*) పోరాడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో మేఘాలయ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.