
తాజా వార్తలు
స్టివ్స్మిత్ బౌలింగ్‌లో విచిత్ర ఘటన
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్లో ప్రముఖ క్రికెటర్ స్టీవ్‌స్మిత్ అరుదైన వికెట్ తీశాడు. న్యూసౌత్‌వేల్స్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన స్మిత్ స్పిన్ బౌలింగ్ వేయగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన జోష్ ఇంగ్లిస్ అనూహ్య రీతిలో ఔటయ్యాడు. ఇంగ్లిస్ ఆడిన డ్రైవ్ షాట్‌కు బంతి సిల్లీ పాయింట్ ఫీల్డర్‌కు తగిలి గాల్లోకి లేచింది. వెంటనే తేరుకున్న షార్ట్‌లెగ్ ఫీల్డర్ దాన్ని అందుకోవడంతో బ్యాట్స్‌మన్ ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో మొత్తం ఆరు ఓవర్లు వేసిన స్మిత్ రెండు మెయిడిన్లు చేశాడు. పది పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. 1.66 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేశాడు. అంతకుముందు తొలిఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ 103 పరుగులతో రాణించాడు. దీంతో న్యూసౌత్‌వేల్స్ జట్టు 223 పరుగులతో విజయం సాధించింది. స్మిత్ 64.56 సగటుతో టెస్టుల్లో మొత్తం 6973 పరుగులు చేయగా.. బౌలింగ్‌లో 17 వికెట్లు సాధించడం విశేషం. మరోవైపు ఆసీస్ జట్టు పాకిస్థాన్‌తో నవంబర్ 21 నుంచి డిసెంబర్ 3 వరకు రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
- మృతదేహంతో నడిరోడ్డుపై నరకయాతన
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
