close

తాజా వార్తలు

రాహుల్‌ రాజీనామా.. కమిటీ తిరస్కరణ

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేస్తున్నారా? లేదా? అన్నదానిపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ శనివారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో రాహుల్‌ తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.  అయితే ఈ రాజీనామాను సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తిరస్కరించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా వెల్లడించారు. 

వర్కింగ్‌ కమిటీ సమావేశం అనంతరం కాంగ్రెస్‌ మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా రణ్‌దీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించారు.  పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతారని, అవసరమైతే పార్టీలు మార్పులు చేసేందుకు రాహుల్‌కు పూర్తి అధికారాలు ఇస్తున్నట్లు కమిటీ తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను త్వరలోనే తీసుకొస్తాం’ అని తెలిపారు. 

ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషించుకునేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నేడు భేటీ అయ్యింది. ఈ సమావేశానికి రాహుల్‌గాంధీ సహా, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్‌ నేతలు గలాం నబీ ఆజాద్‌, ఏకే ఆంటోనీ, మల్లికార్జున్‌ ఖర్గే, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. ఓటమికి గల కారణాలు, పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ తీర్మానం చేశారు. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.