Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144487
            [news_title_telugu_html] => 

అమిత్‌ షా నుంచి ఈరోజే జాబితా

[news_title_telugu] => అమిత్‌ షా నుంచి ఈరోజే జాబితా [news_title_english] => Will get final list of Ministers from Amit bhai today BS Yediyurappa [news_short_description] => అనుకున్న విధంగానే మంగళవారం మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని..మరికొన్ని గంటల్లో మంత్రుల తుది జాబితా తనకు అందుతందని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. మూడు వారాల క్రితం సీఎం బాధ్యతలు స్వీకరించిన............... [news_tags_keywords] => Yediyurappa,Karnataka,Amit shah [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 13:47:33 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అమిత్‌ షా నుంచి ఈరోజే జాబితా - Will get final list of Ministers from Amit bhai today BS Yediyurappa - EENADU
close

తాజా వార్తలు

అమిత్‌ షా నుంచి ఈరోజే జాబితా

బెంగళూరు: అనుకున్న విధంగానే మంగళవారం మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని..మరికొన్ని గంటల్లో మంత్రుల తుది జాబితా తనకు అందుతందని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. మూడు వారాల క్రితం సీఎం బాధ్యతలు స్వీకరించిన ఆయన అన్ని శాఖల్ని తన వద్దే ఉంచుకున్నారు. ‘‘మరికొన్ని గంటల్లో అమిత్‌ షా నుంచి మంత్రుల తుది జాబితా అందుతుంది. మంత్రివర్గ విస్తరణ మంగళవారం 10.30 నుంచి 11.30 మధ్య ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే గవర్నర్‌కి తెలియజేశాను. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించాను’’ అని యడియూరప్ప సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 13 నుంచి 14 మంది మంత్రులు మంగళవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలిపారు. 

మంత్రివర్గ కూర్పులో యడియూరప్పకు అనేక సవాళ్లు ఎదురవనున్నాయి. కుల, మత, ప్రాంతీయ సమీకరణాల్ని పరగణనలోకి తీసుకుంటూనే తనకు సహకరించిన అన్ని వర్గాలకు తగిన స్థానం కల్పించాలి. అలాగే చాలా మంది భాజపా ఎమ్మెల్యేలు ఉత్తర, మధ్య కర్ణాటకకు చెందినవారు. దీంతో ఆయా ప్రాంతాలకు తగిన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. మరోవైపు తనకు, భాజపాకు అండగా ఉంటూ వస్తున్న లింగాయత్ సామాజిక వర్గం నాయకులు భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రులు ఎవరూ ఉండకపోవచ్చునని విశ్వసనీయ సమాచారం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.