Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144610
            [news_title_telugu_html] => 

రాజధానిని ముంచాలని చూశారు: దేవినేని

[news_title_telugu] => రాజధానిని ముంచాలని చూశారు: దేవినేని [news_title_english] => TDP Leader Devineni Uma Comments on Ysrcp [news_short_description] => రాజధాని ప్రాంతాన్ని ముంచాలని తప్ప రాయలసీమ ప్రాంతానికి నీరు తీసుకెళ్లాలని ప్రభుత్వంలో ఎవరైనా తపించారా అని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి  దేవినేని ఉమ ప్రశ్నించారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యంపై కేంద్ర.... [news_tags_keywords] => Devineni Uma,TDP,AP Politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 19:28:09 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాజధానిని ముంచాలని చూశారు: దేవినేని - TDP Leader Devineni Uma Comments on Ysrcp - EENADU
close

తాజా వార్తలు

రాజధానిని ముంచాలని చూశారు: దేవినేని

విజయవాడ: రాజధాని ప్రాంతాన్ని ముంచాలని తప్ప రాయలసీమ ప్రాంతానికి నీరు తీసుకెళ్లాలని ప్రభుత్వంలో ఎవరైనా తపించారా అని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి  దేవినేని ఉమ ప్రశ్నించారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యంపై కేంద్ర జలవనరుల శాఖకు, హోంశాఖకు నివేదికలు పంపుతామని ఆయన చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవినేని మాట్లాడారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌యాదవ్‌ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రోమ్‌ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్‌ వాయించుకున్నట్లు చరిత్రలో చదివామని.. ఇప్పుడు వరదల విషయంలో ప్రభుత్వ తీరును అదే రీతిలో ప్రత్యక్షంగా చూస్తున్నామని దుయ్యబట్టారు. రాష్ట్రానికి జలవనరుల మంత్రి ఆళ్ల రామకృష్ణారెడ్డా? అనిల్‌ కుమారా? అని ఎద్దేవా చేశారు. సీఎం, జలవనరుల శాఖ మంత్రి సొంత జిల్లాలకి నీరు తీసుకెళ్లే అవకాశం ఉన్నా.. అసమర్థతతో సముద్రం పాల్జేశారని ఉమా విమర్శించారు. రాష్ట్రంలో కరవు ఉంటే రాజధాని అమరావతిని నీటితో ముంచాలని చూశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఇంటిని ముంచేందుకు తప్ప మంత్రులు ఏం పని చేశారని నిలదీశారు. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే రీతిలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.