Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145672
            [news_title_telugu_html] => 

రాజధానిపై ప్రజలు ఆందోళనతో ఉన్నారు:సుజనా

[news_title_telugu] => రాజధానిపై ప్రజలు ఆందోళనతో ఉన్నారు:సుజనా [news_title_english] => BJP MP Sujana Choudary Comments on Ap Capital Issue [news_short_description] => వరదలపై సీడబ్ల్యూసీ హెచ్చరించినా ఏపీ ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదని భాజపా ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు. కావాలనే వరదనీటిని ప్రభుత్వం కిందికి వదిలిందా? [news_tags_keywords] => Sujana Choudary,BJP,AP Politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => ZIiaFmwIwk4 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 00:30:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాజధానిపై ప్రజలు ఆందోళనతో ఉన్నారు:సుజనా - BJP MP Sujana Choudary Comments on Ap Capital Issue - EENADU
close

తాజా వార్తలు

రాజధానిపై ప్రజలు ఆందోళనతో ఉన్నారు:సుజనా

దిల్లీ: వరదలపై సీడబ్ల్యూసీ హెచ్చరించినా ఏపీ ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదని భాజపా ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు. కావాలనే వరదనీటిని ప్రభుత్వం కిందికి వదిలిందా? రాజధాని ప్రాంతాన్ని ముంచాలని చూస్తున్నారా? అంటూ మండిపడ్డారు. వరదలతో 50వేల ఎకరాల్లో పంటనష్టానికి బాధ్యులెవరని నిలదీశారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుజనా మాట్లాడారు. వరద నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. రాజధాని విషయంలో ప్రజలు ఆందోళనతో ఉన్నారని.. దీనిపై మంత్రులు బొత్స, అవంతి శ్రీనివాస్‌ తలోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

రాజధాని అంశంలో మంత్రుల అభిప్రాయాలు ప్రభుత్వ వైఖరా? వ్యక్తిగతమా?అన్నది స్పష్టం చేయాలని సుజనా డిమాండ్‌ చేశారు. అమరావతిలో ఇప్పటికే ప్రభుత్వం రూ.కోట్లలో ప్రజాధనం పెట్టిందని.. అనేక భవనాలు కూడా సిద్ధమయ్యాయని చెప్పారు.  రాజధాని విషయంలో ఇష్టానుసారం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆశీస్సులు తీసుకున్నామంటే అర్థమేంటని ఆయన దుయ్యబట్టారు. రివర్స్‌టెండరింగ్‌ విషయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని సుజనా ప్రశ్నించారు. ప్రతిపక్షం తెదేపాకు చంద్రబాబు ఇంటిముంపే సమస్యలా కనిపిస్తోందని.. ఆ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని సుజనా వ్యాఖ్యానించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.