Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000566
            [news_title_telugu_html] => 

రాజధాని తరలించకూడదు: పవన్‌

[news_title_telugu] => రాజధాని తరలించకూడదు: పవన్‌ [news_title_english] => pawan kalyan on capital [news_short_description] => ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి తరలించకూడదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత మెరుగ్గా... [news_tags_keywords] => ap politics,pawan kalyan,capital,amravathi,janasena [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 6ukNkm-eu98 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 15:52:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాజధాని తరలించకూడదు: పవన్‌ - pawan kalyan on capital - EENADU
close

తాజా వార్తలు

రాజధాని తరలించకూడదు: పవన్‌

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి తరలించకూడదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్ర ప్రజల్ని గందరగోళానికి గురి చేసే విధంగా రాజధాని విషయంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత మెరుగ్గా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదని, రాష్ట్రమంతటిదని చెప్పారు. ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధానిని మార్చుకుంటూ పోతే వ్యవస్థలపై నమ్మకం పోతుందని మండిపడ్డారు.

హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో పవన్‌తో రాజధాని ప్రాంత రైతుల బృందం శనివారం కలిసింది. రాజధాని పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఈ సందర్భంగా వారు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పవన్‌ స్పందిస్తూ.. రైతుల ఆవేదన అర్థం చేసుకున్నానని, వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. ఇప్పటికే చేపట్టిన పనులు, నిలిచిన ప్రాజెక్టులను పరిశీలిస్తానని పవన్‌ వెల్లడించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.