close

తాజా వార్తలు

ప్రేమించి పెళ్లాడి.. వదిలేసి.. ఆపై వేధింపులు

మహిళ ఆత్మహత్యాయత్నం : కారకుడైన వ్యక్తి అరెస్టు

మల్కాజిగిరి, న్యూస్‌టుడే: ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకొని తర్వాత విడిపోయి.. వేధింపులకు గురిచేయడంతో విసిగిపోయిన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా ఇందుకు కారకుడైన వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ మన్మోహన్‌, ఎస్సై లింగస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలి లక్ష్మీనగర్‌లో నివసించే ఖాజా జైహింద్‌అలీ తన్వీర్‌(44) మౌలాలిలో భరత్‌ ఫంక్షన్‌హాల్‌ను నిర్వహిస్తున్నాడు. ఠాణా పరిధిలో నివసించే ఓ మహిళ(23) ఆ ఫంక్షన్‌హాల్‌లో ఆరేళ్లుగా పని చేస్తోంది. అతడికి అంతకుముందే వివాహమైనా ప్రేమిస్తున్నానంటూ చెప్పి ఎనిమిది నెలల క్రితం యాదగిరిగుట్టకు తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తన్వీర్‌ కుటుంబ సభ్యులకు తెలియటంతో ఆ మహిళకు కొంత నష్టపరిహారం ఇప్పించారు. పెద్దల జోక్యంతో వారి వివాహబంధం వేరుపడింది. గత శుక్రవారం రాత్రి అతడు ఆమె ఇంటికి వచ్చి దుర్భాషలాడాడు. నీ వల్ల అల్లరిపాలయ్యానని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహిళ బంధువులు జోక్యం చేసుకోవటంతో అక్కడ నుంచి పారిపోయాడు. ఈ సంఘటనతో తీవ్రమనస్తాపానికి గురైన ఆమె శనివారం గుర్తుతెలియని విషం తాగి ఆత్మహత్య యత్నం చేసింది. స్థానికులు అప్రమత్తమై గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆస్పత్రి వర్గాల ద్వారా ఈ సంఘటన పోలీసుల దృష్టికి రావటంతో కేసును విచారించి తన్వీర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.