close

తాజా వార్తలు

ఆ ఆరోపణలు నిరాధారం: శ్రీకాకుళం ఎస్పీ 

అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేదికి శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం మూడు పేజీల లేఖ రాశారు. తనపై వైకాపా నేతలు నిరాధార ఆరోపణలు చేశారని లేఖలో పేర్కొన్నారు. వైకాపా నేతలు చెబుతున్న రోజు తాను కార్యాలయంలోనే ఉన్నానని స్పష్టంచేశారు. ఆ రోజు మావోయిస్టుల సంబంధిత అంశాలపై సమావేశమయ్యామని లేఖలో పేర్కొన్నారు. ఎస్సై ర్యాంకు నుంచి కష్టపడి ఐపీఎస్‌ అధికారిగా ఎదిగానని .. తన జీవితంలో ఎప్పుడూ ఆరోపణలు ఎదుర్కోలేదని లేఖలో తెలిపారు. ఆ రోజు మంత్రి నారాయణకు చెందిన కారులో రూ.50కోట్లు తరలించినట్టుగా ఆరోపించారని, ఉన్నతాధికారుల నుంచి ఫోన్‌ రావడం వల్లే ఎస్కార్టుగా వచ్చినట్టు దురుద్దేశంతో ఫిర్యాదు చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆరోజు వాహనాన్ని పట్టుకున్న మాట వాస్తవమేనని లేఖలో తెలిపిన ఎస్పీ.. తెదేపాకు చెందిన జెండాలు, పోస్టర్లను ఎన్నికల నిఘా బృందం పట్టుకుందని, ఆ విషయాన్ని మీడియా సైతం కవర్‌ చేసిందని గుర్తు చేశారు. విచారణ లేకుండా 24గంటల్లోనే తనపై చర్య తీసుకోవడం బాధించిందని లేఖలో పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. వైకాపా రాసిన లేఖపై ఎంత తొందరగా..కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిందో తన లేఖపైనా అదేవేగంతో నిర్ణయం తీసుకోవాలని కోరారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.