close

తాజా వార్తలు

ఈవీఎంలను పూర్తిగా నిషేధించాలి: నారాయణ

గుంటూరు: ఎన్నికల్లో ఈవీఎంలను పూర్తిగా నిషేధించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో వాటి పనితీరు లోపభూయిష్టంగా ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఈవీఎంలను వాడటం లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. గుంటూరులోని అరండల్‌పేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గత ఎన్నికల్లో భాజపా 37శాతం ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చిందని.. 63శాతం మంది ప్రజలు ఆ పార్టీని వ్యతిరేకించారని చెప్పారు. ఇది నిజమైన తీర్పు కాదని అభిప్రాయపడ్డారు. దామాషా విధానం ద్వారా ఎన్నికలు నిర్వహిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. వామపక్షాలకు ఈ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురయ్యాయన్న ఆయన.. దేశంలో అన్ని వామపక్ష పార్టీలు పునరేకీకరణ జరిగితేనే అవకాశవాద రాజకీయ శక్తులను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.