close

తాజా వార్తలు

ఆధార్‌తో ఎన్నికలు నిర్వహించండి

దిల్లీ: ఓటు గుర్తింపు కార్డులను ఆధార్‌ సంఖ్యతో అనుసంధించేలా భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలంటూ సోమవారం దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. భాజాపా నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ అధార్‌తోనే ఎన్నికలు జరగాలి అని కోరుతూ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుత ఎన్నికల వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండి, పారదర్శకత లోపించిందని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఓటర్లను గుర్తించడం, ఆ సమాచారాన్ని భద్రపరచడం, వారికి గుర్తింపు కార్డుల మంజూరు చేయడం అనేవి ప్రస్తుత కాలంలో పెద్ద సవాళ్లుగా మారాయని ఆయన పేర్కొన్నారు. అందుకే ఒక రక్షణాత్మకమైన ఎన్నికల వ్యవస్థను తయారుచేసుకోవాలన్నారు. ఈ-ఓటింగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టడం ద్వారా వేలిముద్రలు, ముఖకవళికల గుర్తింపుతో ఓటు వేయవచ్చునన్నారు. తద్వారా నకిలీ ఓటింగ్‌ను నిర్మూలించవచ్చునన్నారు. ప్రతి ఎన్నికల ముందు ఒకసారి ఈ ఓటర్ల సమాచారాన్ని క్రమబద్ధీకరిస్తే చాలునని ఆయన తన పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తే స్పందన లేదని అందుకే కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశానన్నారు. మంగళవారం కోర్టులో ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.