close

తాజా వార్తలు

యథావిధిగా తెలంగాణ గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించనున్న ఇంటర్వ్యూలు యథావిధిగా కొసాగనున్నాయి. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలను నిలిపివేయాలంటూ గతంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరిగ్గానే ఉన్నాయని, అందులో జోక్యం అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ సమస్యను ఇంతటితో ముగిద్దామని జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల ధర్మాసనం స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-2 ఇంటర్వ్యూలు నిలిపివేయాలంటూ గతంలో పలువురు పిటిషన్‌ దాఖలు  చేసిన విషయం తెలిసిందే.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.