Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145686
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్‌ @ 9PM [news_title_english] => NINE PM NEWS [news_short_description] => [news_tags_keywords] => TOP NEWS, 9 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 21:01:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్‌ @ 9PM - NINE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

1. హైదరాబాద్‌లో అమెజాన్‌ క్యాంపస్‌ ప్రారంభం

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే తన అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఇవాళ ప్రారంభించింది. తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ ఈ భవనాన్ని ప్రారంభించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నానక్‌రామ్‌గూడలో రూ.400 కోట్ల పెట్టుబడితో అమెజాన్‌ దీన్ని ఏర్పాటు చేసింది. 15 వేలమంది పనిచేయగల సామర్థ్యంతో 9.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను నిర్మించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రాజధానిపై ప్రజలు ఆందోళనతో ఉన్నారు:సుజనా

వరదలపై సీడబ్ల్యూసీ హెచ్చరించినా ఏపీ ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదని భాజపా ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు. కావాలనే వరదనీటిని ప్రభుత్వం కిందికి వదిలిందా? రాజధాని ప్రాంతాన్ని ముంచాలని చూస్తున్నారా? అంటూ మండిపడ్డారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుజనా మాట్లాడారు. రాజధాని విషయంలో ప్రజలు ఆందోళనతో ఉన్నారని.. దీనిపై మంత్రులు బొత్స, అవంతి శ్రీనివాస్‌ తలోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘ఏపీ సత్వర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది’

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, నేతల మనోభావాలను తాము గౌరవిస్తామని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. బుధవారం వైకాపా ఎంపీలు ఆయనతో దిల్లీలో సమావేశమయ్యారు. వాల్తేరు డివిజన్‌ను యథాతథంగా విశాఖ రైల్వే జోన్‌లో కొనసాగించాలని మంత్రిని కోరారు. ఇచ్ఛాపురం, పలాస స్టేషన్లను రాయగఢ డివిజన్‌కు తరలించాలని నిర్ణయించారని.. ఆ స్టేషన్లను వాల్తేరు డివిజన్‌లోనే కొనసాగించాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు విజయసాయిరెడ్డి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. చిదంబరానికి సుప్రీంలో మళ్లీ నిరాశ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన ముందస్తు బెయిల్‌ కోసం చేసుకున్న పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ పిటిషన్‌పై  శుక్రవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు, సీబీఐ అధికారులు చిదరంబరానికి లుక్‌ అవుట్‌ నోటీసులు జారీచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. రైల్వే పరిసరాల్లో ప్లాస్టిక్‌ నిషేధం

అక్టోబర్‌ 2 నుంచి కేవలం ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్‌ ఉత్పత్తులను తమ పరిసరాల్లో నిషేధించాలని భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. అందుకు తగినట్లుగా కార్యచరణను రూపొందించుకుంది. మొదటి దశలో భాగంగా ప్రయోగాత్మకంగా 360 ప్రధాన స్టేషన్లలో 1,853 ప్లాస్టిక్‌ ‘వాటర్‌ బాటిల్‌ క్రషింగ్‌ యంత్రాల’ను నెలకొల్పాలని ప్రణాళిక సిద్ధం చేసింది. దీని ద్వారా వినియోగించిన ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను బయట పడేయకుండా నివారించవచ్చన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. రాజధానిపై జగన్‌ వైఖరి వెల్లడించాలి:దేవినేని

రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై విదేశీ పర్యటనలో ఉన్న సీఎం జగన్‌ ట్విటర్‌ ద్వారా అయినా స్పందించాలని కోరారు. విజయవాడలోని తెదేపా కార్యాలయంలో ఉమా మీడియాతో మాట్లాడారు. రాజధాని రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారం కాదని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఒక్కో మ్యాచ్‌కు 3.8కోట్లు చెల్లించనున్న పేటీఎం

వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పేటీఎం మరోసారి జాక్‌పాట్‌ కొట్టేసింది. మరో ఐదేళ్ల కాలానికి బీసీసీఐ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ.3.80 కోట్ల బిడ్‌ వేసి హక్కులు దక్కించుకుంది. 2019-23 హోం సీజన్‌కు రూ.326.80 కోట్లతో పేటీఎం టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ దక్కించుకొందని బీసీసీఐ బుధవారం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. పిడుగుపాటుకు ఆరుగురి మృతి

ఒడిశాలో వేర్వేరు చోట్ల పడిన పిడుగులకు ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. కేంద్రపారా, పూరీ జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో బుధవారం పలు చోట్ల పిడుగులు పడ్డాయి. కేంద్రపారా జిల్లాలో నలుగురు వ్యక్తులు, పూరీ జిల్లాలో ఇద్దరు వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో పిడుగుల బారిన పడ్డారని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మిషన్‌భగీరథ పుట్టిందే దానికోసం:జీవన్‌రెడ్డి

తన పాలన గతి తప్పిందని సీఎం కేసీఆర్‌ కలెక్టర్ల సదస్సులో ఒప్పుకున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. దీనిబట్టి చూస్తే ఇప్పటి వరకు రాష్ట్రంలో అవినీతి జరిగిందని ఆయన అంగీకరించినట్లే కదా అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మిషన్‌ భగీరథ పుట్టిందే కమీషన్ల కోసమన్నారు. అవినీతికి ద్వారం తెరవడం తప్పా సీఎం కేసీఆర్ చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. కొత్త జెర్సీల్లో తళుక్కుమన్న టీమిండియా క్రికెటర్లు

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ తొలి పోరుకు టీమిండియా సిద్ధమైంది. ప్రస్తుతం నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న కోహ్లీసేన ఈ సిరీస్‌ గెలిచిన తన ఆధిపత్యాన్ని అలాగే కొనసాగించాలని పట్టుదలతో ఉంది. ఆంటిగ్వా వేదికగా గురువారం మొదటి టెస్టు ఆరంభమవుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్ల కొత్త జెర్సీలను ఆవిష్కరించింది. తెల్లని జెర్సీల వెనక పేర్లు ముద్రించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.