Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000452
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్ - 9AM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్ - 9AM [news_title_english] => nine am news [news_short_description] => [news_tags_keywords] => top10,news,9am [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 08:59:23 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్ - 9AM - nine am news - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 9AM

1. మరింత విషమించిన జైట్లీ ఆరోగ్యం

తీవ్ర అనారోగ్యంతో కొద్దిరోజులుగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ (66) ఆరోగ్య పరిస్థితి శుక్రవారం మరింతగా విషమించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మాజీ కేంద్రమంత్రి ఉమాభారతి ఆస్పత్రికి వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆగస్టు 9న జైట్లీని ఎయిమ్స్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. జలహో.. తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ పథకం అద్భుతంగా ఉందని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. జలవనరుల పునరుద్ధరణలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని శుక్రవారం విడుదల చేసిన ‘సమగ్ర నీటి యాజమాన్య సూచిక’ నివేదికలో వెల్లడించింది. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల కింద 51.5% మేర సాగు పెరిగినట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. రూ.15కే టన్ను ఇసుక!

ఏపీ ఖనిజాభివృద్ధిసంస్థ (ఏపీఎండీసీ) నిర్వహించిన టెండర్ల సాక్షిగా గుత్తేదారులు చేసిన బాసలు ఏ మాత్రం గిట్టుబాటు కాని ఈ ధరలను వారు టెండర్లలో ఏ రకంగా కోట్‌ చేశారో అర్థంకాక అధికారులే విస్తుపోతున్నారు. గుంటూరు జిల్లాలోని కృష్ణా నదిలో ఓ రేవు నుంచి   ఇసుక తవ్వి నిల్వ కేంద్రానికి తరలించేందుకు గుత్తేదారులు టన్నుకు రూ.15, శ్రీకాకుళం జిల్లాలో రూ.299కు కోట్‌ చేశారు. అయితే వీటికి సగటున టన్నుకు రూ.100-105గా అధికారులు నిర్ణయించారు. దీంతో శనివారం నిర్వహించే రివర్స్‌ టెండరింగ్‌లో రూ.వందకు పైగా ధరతో టెండర్లు దాఖలు చేసినవారిని పిలవాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. నెల్లూరుకు నేడు ఉప రాష్ట్రపతి

భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శనివారం నుంచి సోమవారం వరకు మూడురోజుల పాటు నెల్లూరు జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శనివారం చెన్నై విమానాశ్రయం నుంచి నెల్లూరుకు ఆయన చేరుకోనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తదితరులు ఆయన వెంట కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఇక హాజరు లెక్క పక్కా! 

రాష్ట్రంలోని పాఠశాలలు, గురుకులాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పక్కాగా నమోదు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ‘టీ-హాజరు’ పేరిట ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, మోడల్‌ పాఠశాలలు, సాధారణ గురుకులాలు, సంక్షేమ పాఠశాలలు, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ‘హాజరు మాసోత్సవం’ సందర్భంగా యాప్‌ను శుక్రవారం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. బ్రిటన్‌ రండి బాబూ..!

యువతకి నచ్చిన కోర్సులో మాస్టర్స్‌ డిగ్రీ చేసేందుకు స్కాలర్‌షిప్స్‌, వృత్తి నిపుణులకు ఫెలోషిప్స్‌ అందిస్తున్నట్టు బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ తెలిపారు. ‘2020-21 విద్యా సంవత్సరానికిగాను విద్యార్థులు, వృత్తి నిపుణుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. ఎక్కువ మంది ఎంపికయ్యే అవకాశం ఉన్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించటం లేదు’ అని హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఐఎస్‌బీలో ఏఐ ల్యాబ్‌

వ్యాపారాధిపతులతో పాటు వ్యాపార సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించే సీఈఓ, సీఎఫ్‌ఓ, సీఎంఓ.. వంటి వారికి కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ)పై శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) చేతులు కలిపాయి. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఐఎస్‌బీలో ‘ఏఐ డిజిటల్‌ ల్యాబ్‌’ ఏర్పాటు చేసేందుకు రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ‘ఏఐ వినియోగంతో వ్యాపారాల రూపాంతరీకరణ’ పేరిట 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని ఇరుసంస్థలు నిర్ణయించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. పాలీపిల్‌తో తగ్గనున్న గుండె జబ్బు ముప్పు

రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలు, ఆస్పిరిన్‌లతో కూడిన ఓ చవకైన మాత్ర..పాలీపిల్‌ను రోజూ తీసుకోవడం ద్వారా గుండె వైఫల్యం, పక్షవాతం ముప్పును మూడొంతులు తగ్గించవచ్చని తాజా పరిశోధనలో వెల్లడైంది. గుండె, రక్తనాళాల వ్యాధుల చరిత్ర లేని వారిలో పాలీపిల్‌ మంచి ప్రభావం చూపుతున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. పుడమి ఊపిరితిత్తుల్లో మంట

పుడమికి ఊపిరితిత్తులుగా భావించే అమెజాన్‌ వర్షారణ్యం.. అగ్నికీలల్లో బుగ్గయిపోతోంది. గత కొన్నేళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ కార్చిచ్చులు ఈ అడవులను దహించేస్తున్నాయి. ఆగస్టు 14న బ్రెజిల్‌లో కొన్నిచోట్ల మాత్రమే కనిపించిన మంటలు... ఎగిసిఎగిసి వేలాది ప్రాంతాలకు, పొరుగు దేశాలకు శరవేగంగా విస్తరిస్తుండటం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. 108 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో కోహ్లీసేన పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆటలో  తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 297 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ రెండో రోజు ఆట ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్‌ 108 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు సింధు, సాయిప్రణీత్‌ చరిత్ర సృష్టించారు. అద్భుతమైన ఆటతీరుతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి పతకాలు ఖాయం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.