close

తాజా వార్తలు

ఇంటర్నెట్‌ వ్యక్తిగత హక్కే!

కేరళ హైకోర్టు కీలక తీర్పు

తిరువనంతపురం: ఇంటర్నెట్‌కు సంధానమయ్యే హక్కు కూడా ప్రాథమిక హక్కేనని కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 18 సంవత్సరాలు నిండిన వారికి ఇది రాజ్యాంగంలో పేర్కొన్న వ్యక్తిగత గోప్యత హక్కు, విద్యా హక్కుల్లో భాగంగా ఉంటుందని స్పష్టం చేసింది.  సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సెల్‌ఫోన్‌ వాడకూడదనే నిబంధనను ఉల్లంఘించారంటూ కోజికోడ్‌ జిల్లా చెలనూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఫహీమా శిరిన్‌, మరికొందరు విద్యార్థినులను కళాశాల బాలికల వసతి గృహం నుంచి పంపేశారు. ఈ నిబంధన కారణంగా ఇంటర్నెట్‌లో తమ కోర్సుకు సంబంధించిన విషయాలను శోధించడానికి ఆటంకం కలుగుతోందని, బాలుర వసతి గృహంలో ఇలాంటి నిబంధన ఏమీ లేదని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.