close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. ‘కంటి వెలుగు’ ప్రారంభించిన సీఎం జగన్‌

ఏపీలో అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా  రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టింది. తొలి దశ కంటి వెలుగు పథకాన్ని అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి  ప్రారంభించారు. తొలి రెండు దశల్లో 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్‌, డిసెంబర్‌లో సమగ్ర పరీక్షలు చేయనున్నారు. ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించడంతోపాటు కళ్లజోళ్లు వైద్య సదుపాయాలు అందించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జగన్‌పై విమర్శలు గుప్పించిన దేవినేని

గతంలో చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇ-ఐ కేంద్రాలను 4 నెలలు నిలిపివేసి ఇవాళ ‘ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ పేరుతో  కొత్త పథకం తెచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్‌ ఆర్భాటం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఆరోపించారు. గత ఏడాది ఫిబ్రవరిలో చంద్రబాబు ఇ-ఐ కేంద్రాలను ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. విజయవాడలో దేవినేని విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో 67లక్షల మందికి ఉచిత కంటి చికిత్సలు చేయించటంతో పాటు 3లక్షల మందికి ఉచితంగా కళ్ళజోళ్ళు ఇచ్చామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘పోలవరం పూర్తిచేయాలనేదే మా సంకల్పం’

బాపూజీ 150వ జయంతిని పురస్కరించుకొని గాంధీ సంకల్ప యాత్ర చేపట్టనున్నట్టు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో భాజపా పార్లమెంట్‌ సభ్యులు ఈ యాత్రలో పాల్గొంటారన్నారు.  బాపూజీ సిద్ధాంతాలు పాటించడం, ఆయన ఆశయాలు సాధించడం కోసమే ఈ యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును రేపు సందర్శిస్తామనీ.. ప్రస్తుతం ప్రాజెక్టు పురోగతి ఎలా ఉందో పరిశీలిస్తామన్నారు. పోలవరం కచ్చితంగా పూర్తిచేయాలనేదే తమ పార్టీ సంకల్పమని కన్నా స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జగన్‌ పర్యటన:ఎమ్మెల్యే, మంత్రి మధ్య వివాదం

‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలు పట్టిన తర్వాత జగన్‌ అనంతపురంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆయనకు మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వేంకట్రామిరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే, మంత్రి మధ్య వివాదం హెలిపాడ్ వద్ద సీఎం జగన్‌ వద్దకు వెళ్లి స్వాగతం చెప్పే జాబితాలో తన పేరు లేదని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘బిగ్‌బాస్‌’ను బ్యాన్‌ చేయండి!

గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్న బాలీవుడ్‌ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా ఇటీవల ‘బిగ్‌బాస్‌ 13వ సీజన్‌’ ప్రారంభమైంది. అయితే ఈ షోను వెంటనే బ్యాన్‌ చేయాలని రాజస్థాన్‌కు చెందిన కర్ణిసేన డిమాండ్‌ చేస్తోంది. ‘బిగ్‌బాస్‌’ షో భారతీయ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉందని, దాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ కర్ణిసేన సంస్థకు చెందిన ప్రతినిధులు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు ఓ లేఖను రాశారు. జాతీయ మీడియా వేదికగా హిందూ సంప్రదాయాలను అవహేళన చేస్తున్నారని వారు ఈ లేఖలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సరిహద్దులో మళ్లీ పాక్‌ డ్రోన్ల కలకలం

సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రెండు రోజుల క్రితం పంజాబ్‌లోని హుస్సేనివాలా సెక్టారులో పాక్‌ డ్రోన్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా  ఆ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్‌ పరిధిలోని ఝూగే హజారా సింగ్‌ గ్రామం వద్ద  రెండు డ్రోన్లు కలియతిరగడం మరోసారి కలకలం రేపింది. ఆ డ్రోన్లు పాక్‌ వైపు నుంచి వచ్చినట్లు హజారాసింగ్‌ గ్రామస్థులు తెలిపారు. భారత సరిహద్దులో ఉన్న ఈ గ్రామం వద్ద కొంతసేపు డ్రోన్లు చక్కర్లు కొట్టినట్లు ఆ గ్రామస్థులు సరిహద్దు భద్రతా దళాలకు సమాచారం ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సెమీస్‌కు దూసుకెళ్లిన మేరీకోమ్‌

మహిళల బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో మేరీకోమ్ దూసుకుపోతోంది. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి, ఒలింపిక్స్‌ పతక విజేత ఇంగ్రిత్‌ వెలెన్సియాపై 5-0 తేడాతో గెలిచి సెమీస్‌కు చేరింది. దీంతో కోమ్‌ వరుసగా ఎనిమిదో సారి ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ పతకాన్ని ఖాయం చేసుకుంది. మేరీ 51 కేజీల విభాగంలో తలపడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఛత్తీస్‌ఘడ్‌లో తొలి గార్బేజ్‌ హోటల్‌

9. మాజీ డిప్యూటీ సీఎం ఇంటిపై ఐటీ దాడులు

కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ఐటీ దాడుల కలకలం మొదలైంది. కాంగ్రెస్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర, మరో నేత ఆర్‌ఎల్‌ జాలప్పలకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో గురువారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పరమేశ్వరకు చెందిన దాదాపు 30 ప్రదేశాల్లో అధికారులు దాడులు చేశారు. మెడికల్‌ కళాశాల ప్రవేశాల సమయంలో పరమేశ్వర పెద్ద ఎత్తున నల్లధనం మార్పిడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా పరమేశ్వరకు చెందిన తుమ్‌కూర్‌లోని సిద్ధార్థ గ్రూప్‌ విద్యా సంస్థలను సీజ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ 6 హత్యలే కాదు.. జాలీ ఖాతాలో ఇంకొన్ని!

కేరళలోని కోజికోడ్‌లో సంచలనం సృష్టించిన 6 వరుస హత్యల ఘటన నిందితురాలు జాలీ మరికొన్ని హత్య కేసుల్లోనూ నిందితురాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జాలీ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంది. ఈమె మొదటి భర్త రాయ్‌ థామస్‌ సమీప బంధువు ఎల్సమ్మ అనే మహిళ మీడియాతో జాలీ గురించి మరికొన్ని విషయాలు వెల్లడించింది. మరో మూడు హత్యోదంతాల వెనక జాలీ హస్తం ఉన్నట్లు ఆమె తెలిపింది. 2002లో ఎల్సమ్మ కుమారుడు సునీష్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆ ప్రమాదం జాలీనే చేయించిందని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.