close

తాజా వార్తలు

కేజ్రీవాల్‌ పేరుతో ‘ఏకే యాప్‌’

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘ఏకే యాప్‌’ పేరుతో మొబైల్‌ యాప్‌ను దిల్లీలో విడుదల చేశారు. దిల్లీ ప్రజలు, ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకు వీలుగా ఈ యాప్‌ను ప్రారంభించారు. ఎప్పుడైనా పార్టీపై కానీ, ఆప్‌ నేతలపై తప్పుడు ప్రచారం జరిగితే వాస్తవాలను ప్రజలందరికీ తెలియజేసేందుకే ఏకే యాప్‌ను తీసుకొచ్చినట్లు కేజ్రీవాల్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో అందుబాటులో ఉండే ఆ యాప్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రస్థానం, విజయాలు, పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలను ఈ యాప్‌లో పొందుపర్చినట్లు కేజ్రీవాల్ ట్విటర్‌ ద్వారా తెలిపారు. అంతేకాకుండా దిల్లీ ముఖ్యమంత్రి పర్యటనలు, ప్రజా సంబంధ కార్యక్రమాలు, లైవ్‌ టీవీ తదితర వివరాలు ఈ యాప్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటాయని ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన వీడియో ద్వారా కేజ్రీవాల్‌ వివరించారు. ఈ యాప్‌ ప్రత్యేకతలను వివరిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారిక ట్విటర్‌లో పూర్తి వివరాలను పోస్ట్‌ చేశారు.




Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.