
తాజా వార్తలు
ఆపన్నహస్తం అందేలోగా అమరుడయ్యాడు
ఆయన పేరు చెంచన్న. కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీనగర్‌లో ఉండేవారు. ఇతనికి ఆరుగురు కుమారులు ఉన్నారు. వారికి ఎలాంటి కష్టం రాకూడదని తలంచారు. కాయాకష్టం చేసి వారిని పెంచి పెద్ద చేశారు. వయస్సు మీదపడింది. వృద్ధాప్యంతో ఏపనీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి కొడుకులు భారంగా భావించారు. పిడికెడు అన్నం పెట్టేవారే కరవయ్యారు. ఆదరించేవారు లేక.. అందరూ ఉన్నా అనాథ అయ్యారు. చివరికి బంగారుపేటలో ఫుట్‌పాత్‌నే ఆవాసంగా మార్చుకున్నారు. రోడ్డున వెళ్లే వారి వద్ద చేయి చాస్తూ పొట్టనింపుకొనేవారు. చలికి వణుకుతూ.. ఎండకు ఎండిన ఆయన చివరికి అనారోగ్యానికి గురయ్యారు. దీనిపై ఆయన చిత్రంతో సహా ఈనెల 19వ తేదీన ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘చలించాలి మనిషితత్వం.. జ్వలించాలి మానవత్వం’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. స్పందించిన ఆళ్లగడ్డ, అనంతపురం, చిత్తూరు, డోన్ ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకు వచ్చేలోగా ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారు. బుధవారం మధ్యాహ్నం చెంచన్న చనిపోయారు. కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లారు.
- న్యూస్‌టుడే, కర్నూలు
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ‘నా జీవితంలో అది భయంకరమైన జ్ఞాపకం’
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- గొల్లపూడి తీరని కోరిక..!
- మాది గురుశిష్యుల సంబంధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
