close

తాజా వార్తలు

భారత్‌ మన అందరిదీ: కోవింద్‌

జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

దిల్లీ: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు. మహిళలు, రైతులు దేశంలో సాధికారత సాధిస్తున్నారని చెప్పారు. డిజిటల్‌ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. జాతీయ వనరులపై అందరికీ హక్కులు ఉన్నాయని, నేటి మన నిర్ణయాలే భవిష్య భారత్‌కు మార్గదర్శకాలని చెప్పారు. ఈసారి గణతంత్ర దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ ఏడాది అక్టోబర్‌ మాసంలో జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాల ద్వారా గాంధీజీ ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలను యావత్‌ ప్రపంచం అర్థం చేసుకొనే అవకాశం కలుగుతుందని తెలిపారు. అన్ని ఇళ్లను విద్యుదీకరించడం శుభపరిణామమన్నారు. పది శాతం రిజర్వేషన్ల ద్వారా అగ్రవర్ణాల్లో పేదలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్రపతి తెలిపారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు...

* భారత్‌ మన అందరిదీ.. అన్ని వర్గాలది, అన్ని మతాలది. ప్రతి పౌరుడిది. దేశంలోని బహుళత్వం మన బలం. వైవిధ్యం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి భారత్‌ విధానాలు.

* దేశంలో మహిళలు.. విద్య, కళలు, ఆరోగ్య, క్రీడా రంగాల్లోనే కాకుండా త్రివిధ దళాల్లోనూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విద్యా సంస్థల్లో బాలుర కంటే బాలికలే బాగా రాణిస్తున్నారు.

* ఈ ఏడాది దేశ పౌరులకు తమ కీలక బాధ్యతను నెరవేర్చుకోవాల్సిన అవకాశం వచ్చింది. 17వ లోక్‌సభకు జరగనున్న ఎన్నికలు శతాబ్దంలో ఒకసారి వచ్చే అరుదైన ఘట్టంలా కనపడుతున్నాయి. 21వ శతాబ్దంలో జన్మించిన వారు మొదటిసారి తమ ఓటు హక్కు ద్వారా కొత్త లోక్‌సభను ఎన్నుకోవడంలో ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.

* ప్రజాస్వామ్యంలోని మన ఆలోచనలు, ఆదర్శాలే ఎన్నికల రూపంలో ప్రతిబింబిస్తాయి. ఓటర్లు తమ తీర్పుతో తమ భవిష్యత్తుకి మార్గం వేసుకుంటారు. ఎన్నికలు అంటే కేవలం రాజకీయ కసరత్తులు మాత్రమే కాదు. ప్రజల ఎన్నో ఆశలు, లక్ష్యాలు నెరవేరడం కోసం జరిగే ప్రక్రియ.

* భారత్‌ ఎన్నో రంగాల్లో గొప్ప ప్రయాణం కొనసాగించింది. మనం పూడ్చవలసిన చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి. చాలా మంది కన్నీళ్లను తుడవాల్సి ఉంది.

* అత్యాధునిక సందాయకత ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా మనల్ని ఏకం చేస్తోంది. భారత్ చాలా ఐక్యంగా ఉంది.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.