close

తాజా వార్తలు

ప్రధాని క్షమాపణ కోరడంపై చిన్నారి స్పందన

బృందావన్‌: సోమవారం అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన ‘త్రీ బిలియన్త్ మీల్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరై పేద విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా  మారాయి. కార్యక్రమానికి ఆలస్యం వచ్చినందుకు ప్రధాని ఓ విద్యార్థికి క్షమాపణ చెప్తున్న వీడియో ఇన్‌స్టాగ్రాంలో దర్శనమిచ్చింది. ‘ఇప్పుడు మధ్యాహ్నం 1:30 అవుతోంది. మామూలుగా మీకు మధ్యాహ్నం 12 గంటలకు వడ్డించాల్సింది. కానీ ప్రధానమంత్రి ఆలస్యంగా వచ్చినందుకు మీకు భోజనం పెట్టడం ఆలస్యమైంది. అంతేకదా?’ అని ఆ వీడియోలో విద్యార్థితో మాట్లాడారు. దానికి ఓ విద్యార్థిని ‘మేం ఉదయం తినే వచ్చాం’ అంటూ  టక్కుమని సమాధానం చెప్పింది. ‘చిన్నారులతో కొద్దిసేపు సరదాగా సంభాషించాను. మధ్యాహ్న భోజనం ఆలస్యం కావడాన్ని వారు పెద్దగా పట్టించుకోలేదు’ అని క్యాప్షనిస్తూ వారితో ముచ్చటించిన వీడియోను పోస్ట్ చేశారు ప్రధాని.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.