close

తాజా వార్తలు

అప్పు తీర్చలేక బిడ్డను అప్పగించి..

తమిళనాడులో ఘటన..

బాలుడిని రక్షించిన అధికారులు

తంజావూరు: ప్రకృతి బీభత్సం ఆ ఇంటి పెద్దను పొట్టనబెట్టుకుంది. అంత్యక్రియలకు కూడా డబ్బు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆ ఇల్లాలు అప్పు కోసం చేయిచాచింది. అయితే ఆ అప్పును తీర్చలేక తన 10ఏళ్ల కుమారుడిని ఓ భూస్వామి వద్ద పనికి పంపించింది. ఈ హృదయ విదారక ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఓ స్వచ్ఛంద సంస్థ జోక్యంతో చిన్నారిని అధికారులు రక్షించారు. వివరాల్లోకి వెళితే..

ఈ ఏడాది జనవరిలో తమిళనాడులో గజ తుపాను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ తుపానులో తంజావూరులోని పట్టుకొట్టాయి ప్రాంతానికి చెందిన ఓ ఇల్లు కూలి యజమాని ప్రాణాలు కోల్పోయాడు. భర్త అంత్యక్రియలు జరిపేందుకు డబ్బుల్లేకపోవడంతో అతని భార్య ఒక భూస్వామి వద్ద రూ. 36వేలు అప్పుగా తీసుకుంది. అయితే ఇచ్చిన గడువులోగా ఆ డబ్బు తిరిగివ్వకపోవడంతో తన 10ఏళ్ల కుమారుడిని వెట్టిచాకిరి కోసం భూస్వామికి అప్పగించింది.

ఐదో తరగతి మధ్యలోనే ఆపేసిన ఆ బాలుడితో సదరు భూస్వామి వెట్టిచాకిరీ చేయించుకున్నాడు. ఒక్కపూట భోజనం పెట్టేవాడు. చిన్న పిల్లాడని కూడా చూడకుండా అతడితో 200 మేకలు కాయించాడు. ఈ విషయం ఓ స్వచ్ఛంద సంస్థకు తెలిసింది. దీంతో వారు స్థానిక అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు బాలుడిని రక్షించి ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం భూస్వామి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.