close

తాజా వార్తలు

100% కమలం లవ్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్ర్యతేకం: కొన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో భాజపా హవా స్పష్టంగా కనిపించింది. ప్రత్యర్థి పార్టీలకు కనీసం ఒక్క సీటుకూడా దక్కలేదు. మొత్తం 74సీట్లను ఈ ప్రాంతాల నుంచి దక్కించుకొంది. వీటిల్లో ఆప్‌ బలంగా ఉన్న దిల్లీ కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఏడు ఎంపీ స్థానాలను భాజపా నిలబెట్టుకుంది.. ఇక మధ్యప్రదేశ్‌ , హరియాణాల్లో  కేవలం ఒక్క స్థానం మాత్రమే ప్రత్యర్థులకు దక్కగా.. మిగిలినవి మొత్తం భాజపా ఖాతాలోనే పడ్డాయి. భాజపా క్లీన్‌స్వీప్‌ చేసిన రాష్ట్రాల నుంచి 74 సీట్లు లభించాయి. త్రుటిలో క్లీన్‌ స్వీప్‌ను కోల్పోయిన ప్రాంతాలను చేర్చుకుంటే ఈ సీట్ల సంఖ్య 150కు చేరుతుంది. 
క్లీన్‌ స్వీప్‌ 
* ఉత్తరాఖండ్‌-5
* అరుణాచల్‌ ప్రదేశ్‌-2
* త్రిపుర-2
* గుజరాత్‌ -26
* రాజస్థాన్‌-25
* హిమాచల్‌ ప్రదేశ్‌-4
* దామన్‌-1
* దిల్లీ-7
* చండీగఢ్‌‌-1

త్రుటిలో క్లీన్‌ స్వీప్‌ తప్పినవి..

మధ్య ప్రదేశ్‌(29) భాజపాకు 28
హరియాణా(10)- భాజపాకు 9
మణిపూర్‌(2)-భాజపాకు 1
కర్ణాటక(28)-భాజపాకు 25
గోవా(2)- భాజపాకు 1
ఝార్ఖండ్‌(14)- భాజపాకు 12 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.