close

తాజా వార్తలు

నేపాల్‌లో బాంబు పేలుళ్లు.. నలుగురి మృతి

ఖాఠ్మాండు: నేపాల్‌లో జరిగిన మూడు వేర్వేరు బాంబు పేలుళ్లలో నలుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాఠ్మాండులోని సుకేధర, ఘట్టెకులో, నాగ్‌ధుంగా ప్రాంతాల్లో ఆదివారం ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లతో సంబంధముందని భావిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నగరం మధ్యలోని ఘట్టెకులో ప్రాంతంలో జనావాసాల్లో జరిగిన పేలుడులో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానిక వార్తా పత్రికలు వెల్లడించాయి. రెండో పేలుడు నగర శివారులోని సుకేధరలో ఓ క్షౌర దుకాణంలో జరిగింది. పేలుళ్లకు సమీపంలోని గోడలు సైతం బీటలు వారాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలాలను ఆ దేశ ఆర్మీ మోహరించింది. అయితే, ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకూ ఏ ఉగ్ర సంస్థా ప్రకటించలేదు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.