
తాజా వార్తలు
లఖ్‌నవూ (ఉత్తర్‌ప్రదేశ్): తమను దుండగులు అపహరించారని అసత్యాలు చెప్పి ఇద్దరు విద్యార్థులు తమ తల్లిదండ్రులను, పోలీసులను పరుగులు పెట్టించిన ఘటన లఖ్‌నవూలోని సాదత్గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ ఇద్దరు బాలురలో ఒకరికి 13, మరొకరికి 11 ఏళ్లు. వారిద్దరు పాఠశాలకు వెళ్లకుండా ఇతర ప్రాంతానికి వెళ్లి ఆడుకున్నారు. అయితే, తాము పాఠశాలకు వెళ్లలేదని తమ తల్లిదండ్రులకు తెలిస్తే వారు కొడతారని భయపడి కిడ్నాప్ కథ అల్లారు. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి వెళ్లిన ఆ ఇద్దరు విద్యార్థులు సాయంత్రం ఇంటికి వచ్చారు. తాము అల్లిన కథను తమ కుటుంబ సభ్యులకు చెప్పారు.
తాము పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఒక కారులో వచ్చిన దుండగులు తమను అందులోకి లాగి తీసుకెళ్లారని, ఓ ప్రాంతంలో తాము కారు అద్దాలను ధ్వంసం చేసి కేకలు వేశామని చెప్పారు. ట్రాఫిక్ సమస్య కారణంగా కారు వేగం తగ్గడంతో అందులోంచి దూకి పారిపోయామని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో భయపడిపోయిన తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాపర్లను పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తాము కిడ్నాప్ అయ్యామని చెబుతున్న ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అయితే, ఆ ప్రాంతంలో ఆ విద్యార్థులు గానీ, ఏ కారు గానీ రాలేదని గుర్తించారు. దీంతో ఈ విషయంపై ఆ బాలురను మరోసారి ప్రశ్నించగా తామే ఈ కథ అల్లామని ఒప్పుకున్నారు. తాము హోం వర్క్ చేయలేదని, పాఠశాలకు వెళ్లడం కూడా ఆలస్యం కావడంతో ఇలా చేశామని అన్నారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
