close

తాజా వార్తలు

జల్‌జల.. తిరిగి సముద్రంలో కలిసింది..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం : జల్‌జలా దీవి గుర్తుందా.. 2013లో పాక్‌లోని బలూచిస్థాన్‌ రాష్ట్రంలో సంభవించిన భారీ భూకంపంతో అక్కడి సముద్రతీరానికి సమీపంలో ఆవిర్భవించిన చిన్న దీవి.  గ్వదర్‌ నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న ఈ చిన్న దీవి క్రమంగా సముద్ర జలాల్లో కలిసిపోయినట్టు నాసా చిత్రాలు వెల్లడిస్తున్నాయి. 90 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల పొడవుతో ఉన్న ఈ దీవి మొత్తం బురదమయంగానే ఉండేది. 

ఎలా ఆవిర్భవించింది..
రెండు భూఫలకాలు ఢీకొనడంతో ఈ దీవి ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. యురేషియా ఫలకాన్ని అరేబియా ఫలకం ఢీకొనడంతో రిక్టర్‌ స్కేలుపై  7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫలితంగా సముద్రంలో ఈ దీవి ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. సముద్రంలో ఏర్పడే భూకంపాల కారణంగా కొన్ని చోట్ల ఇలాంటి దీవులు ఏర్పడుతుంటాయని అనంతరం తిరిగి సముద్రంలో కలిసిపోతుంటాయని వెల్లడించారు. 2013లో ఈ దీవి ఆవిర్భావం సంచలనం సృష్టించింది. దీనికి జల్‌జలా కో అని పేరుపెట్టారు. దీనర్థం భూకంప పర్వతమని. ఆరేళ్లుగా ఉన్న దీవి తిరిగి సముద్రంలో కలిసిపోయినట్లు నాసా తెలిపింది. దీనికి సంబంధించిన చిత్రాలను వారు విడుదల చేశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భారీ భూకంపం ఏర్పడితే ఆ దీవి మళ్లీ పైకి వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు చెప్పారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.