Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142931
            [news_title_telugu_html] => 

మోదీ పక్కన ‘ఉన్నావ్‌’ నిందితుడి ఫొటో!

[news_title_telugu] => మోదీ పక్కన ‘ఉన్నావ్‌’ నిందితుడి ఫొటో! [news_title_english] => Sengar shares space with PM Modi in advt by BJP leader [news_short_description] => స్థానిక నాయకుడి అత్యుత్సాహం భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పడేసింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చిన ఓ పత్రికా ప్రకటనలో ఉన్నావ్‌ అత్యాచార నిందితుడి చిత్రం.... [news_tags_keywords] => Sengar,PM Modi,BJP,UP,Unnao,advt [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 00:33:29 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మోదీ పక్కన ‘ఉన్నావ్‌’ నిందితుడి ఫొటో! - Sengar shares space with PM Modi in advt by BJP leader - EENADU
close

తాజా వార్తలు

మోదీ పక్కన ‘ఉన్నావ్‌’ నిందితుడి ఫొటో!

లఖ్‌నవూ(యూపీ): స్థానిక నాయకుడి అత్యుత్సాహం భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పడేసింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చిన ఓ పత్రికా ప్రకటనలో ఉన్నావ్‌ అత్యాచార నిందితుడి చిత్రం ఉండడం విమర్శలకు తావిచ్చింది. ఇక్కడి ఉంగునగర్‌ పంచాయతీ ఛైర్మన్‌ అనుజ్‌కుమార్‌ దీక్షిత్‌ స్థానిక పత్రికలో భారతీయ జనతా పార్టీ తరఫున ఓ ప్రకటన ఇచ్చారు. అందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు ఉన్నావ్‌ నిందితుడు కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ చిత్రం కూడా ఉండటం గమనార్హం. అతడితో పాటు ఆయన భార్య, జిల్లా పంచాయతీ ఛైర్మన్‌ సంగీతా సింగ్‌ సెంగార్‌ చిత్రం కూడా ఉంది. వీరితో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌, యూపీ అసెంబ్లీ స్పీకర్‌ హృదయ్‌ నరైన్‌ దీక్షిత తదితరుల చిత్రాలు అందులో ఉన్నాయి.

అత్యాచార ఘటన, బాధితురాలిపై హత్యాయత్నం కేసులో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో సెంగార్‌ను భాజపా బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రకటనలో సెంగార్‌ చిత్రం కనిపించడం కలకలం రేపింది. దీనిపై ప్రకటన ఇచ్చిన దీక్షిత్‌ను స్థానిక మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన తమ ఎమ్మెల్యే కాబట్టి ప్రకటనలో ప్రచురించామని చెప్పుకొచ్చారు. మరోవైపు భాజపా మాత్రం ఈ వివాదానికి దూరంగా నిలిచింది. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి శలబమణి త్రిపాఠి మాట్లాడుతూ ‘అది వారి వ్యక్తిగత విషయమని, పార్టీతోగానీ, ప్రభుత్వానికి గానీ దాంతో సంబంధం లేదు’ అని సమాధానం ఇచ్చారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.