Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144443
            [news_title_telugu_html] => 

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కేసులో రాజ్‌ఠాక్రేకు సమన్లు

[news_title_telugu] => ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కేసులో రాజ్‌ఠాక్రేకు సమన్లు [news_title_english] => Raj Thackery summoned by ED in ILFS Case [news_short_description] => ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అవకతవకల కేసులో మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. గురువారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.......... [news_tags_keywords] => Raj Thackeray,MNS,ED,IL&FS [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 23:05:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కేసులో రాజ్‌ఠాక్రేకు సమన్లు - Raj Thackery summoned by ED in ILFS Case - EENADU
close

తాజా వార్తలు

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కేసులో రాజ్‌ఠాక్రేకు సమన్లు

ముంబయి: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అవక తవకల కేసులో మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది. గురువారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ నుంచి రూ.860కోట్ల రుణం తీసుకున్న సీటీఎన్‌ఎల్‌ నిర్మాణ సంస్థతో ఆయనకు సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. ఆయనతో పాటు శివసేన సీనియర్‌ నాయకుడు మనోహర్‌ జోషి కుమారుడు అన్మేశ్‌ జోషికి సైతం సమన్లు జారీ చేశారు. సీటీఎన్‌ఎల్‌ సంస్థలో వాటాలు, పెట్టుబడులు ఉన్న అందరినీ విచారిస్తున్న క్రమంలోనే రాజ్‌ఠాక్రే, అన్మేశ్‌కి సైతం సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాజ్‌ఠాక్రే ఆయన వాటాల్ని 2008లోనే విక్రయించినట్లు సమాచారం.

దివాలా దశలో ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ని గత సంవత్సరం ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే కొత్త బోర్డును సైతం ఏర్పాటు చేసింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తన మొండి బకాయిల్ని గత కొన్ని సంవత్సరాలుగా వెల్లడించక నష్టాల్ని దాచిచూపే ప్రయత్నం చేసినట్లు ఆర్బీఐ ఓ నివేదికలో పేర్కొంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.