Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144488
            [news_title_telugu_html] => 

బిహార్‌ మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్రా కన్నుమూత

[news_title_telugu] => బిహార్‌ మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్రా కన్నుమూత [news_title_english] => Bihar Former CM Jagannath Mishra passes away [news_short_description] => దిల్లీ: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ మిశ్రా (82) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. బిహార్‌ ముఖ్యమంత్రిగా.... [news_tags_keywords] => Jagannath Mishra, Passes away, Patna [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 13:26:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బిహార్‌ మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్రా కన్నుమూత - Bihar Former CM Jagannath Mishra passes away - EENADU
close

తాజా వార్తలు

బిహార్‌ మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్రా కన్నుమూత

దిల్లీ: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ మిశ్రా (82) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. బిహార్‌ ముఖ్యమంత్రిగా ఆయన మూడు పర్యాయాలు పనిచేశారు. పీవీ నర్సింహారావు హయాంలో కేంద్రమంత్రిగానూ సేవలందించారు. రాజకీయాల్లోకి రాకముందు జగన్నాథ్‌ మిశ్రా బిహార్‌ విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్‌లో ఆచార్యుడిగా పనిచేశారు. అనేక పుస్తకాలను కూడా రాశారు. తొలుత కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఆ తర్వాత హస్తం పార్టీని వీడి ఎన్సీపీలో చేరారు. తదనంతరం జేడీయూలోనూ పనిచేశారు. పశుగ్రాసం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న జగన్నాథ్‌ మిశ్రాను ఇటీవల రాంచీ న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

బిహార్‌లో మూడు రోజుల సంతాప దినాలు  
మిశ్రా మరణం పట్ల జేడీయూ శ్రేణులు తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నాయి. ఆయన చాలా గొప్ప నేత అని.. మిశ్రా మరణం రాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటని పేర్కొంటున్నాయి. మరోవైపు, జగన్నాథ్‌ మిశ్రా మృతిపై బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ విచారం వ్యక్తంచేశారు. మిశ్రా మృతికి సంతాపంగా రాష్ట్రంలో మూడు రోజులపాటు సంతాపదినాలు ప్రకటించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.