close

తాజా వార్తలు

గాంధీజీ ప్రమాదంలో చనిపోయారట!

ఒడిశాలో వివాదాస్పదంగా మారిన బుక్‌లెట్‌

భువనేశ్వర్‌: ప్రమాదం కారణంగా మహాత్మగాంధీ చనిపోయారని పేర్కొంటూ ఒడిశా విద్యాశాఖ ప్రచురించిన ఓ రెండు పేజీల బుక్‌లెట్‌ వివాదాస్పదమైంది. మేధావులు, సామాజిక ఉద్యమకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై  ఒడిశా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై ఒడిశా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ మాట్లాడుతూ..‘ఆమా బాపూజీ : ఏక్‌ ఝలకా’ (మన బాపూజీ : ఒక సంగ్రహావలోకనం)లో వివాదాస్పదానికి దారితీసిన అంశం ఎలా ప్రచురితమైందనే విషయంపై విచారణకు ఆదేశించామని చెప్పారు. బుక్‌లెట్‌లో ప్రమాదం కారణంగానే గాంధీ చనిపోయారని మాత్రమే కాకుండా ఆ ప్రమాదం ఎలా జరిగిందో కూడా విశదీకరించారని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే బుక్‌లెట్‌ను ఉపసంహరించుకున్నామని దాస్‌ స్పష్టంచేశారు.  

గాంధీజీ హత్యను ప్రమాదంగా చెప్పడాన్ని పలువురు మేధావులు తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. గాడ్సే సానుభూతిపరులు ఉద్దేశపూర్వకంగా ఈ బుక్‌ను ప్రచురించారని కార్యకర్త ప్రఫుల్లా సమంత్ర విమర్శించారు. గాడ్సే వంటి ఉన్మాది చేతిలో గాంధీ మహాత్ముడు చనిపోయాడని చెప్పకుండా భావితరాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఓ వైపు గాంధీజీ 150వ జయంత్యుత్సవాలు ఘనంగా చేస్తూ మరోవైపు ఇలా అవమానించడం తగదని సమంత్ర ఆక్షేపించారు. 

గత నెలలో గుజరాత్‌లోని ఓ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రంలో ‘గాంధీజీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు?’ అనే ప్రశ్న కలకలం సృష్టించిన ఘటనను ఇంకా మరువకముందే ఈ తాజా ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.   


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.