
తాజా వార్తలు
హైదరాబాద్ : ప్రతి ఒక్కరికి ఆధార్ అనే నినాదంలో భారత విశిష్ఠ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ముందుకు సాగుతోంది. అప్పుడే పుట్టిన శిశువుల దగ్గర నుంచి ఐదేళ్లలోపు వయస్సున్న వారి వరకు ఆధార్ జారీకి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆయా రాష్ట్రాల స్త్రీ, శిశు సంక్షేమ శాఖలతో కలిసి ఆ ప్రక్రియను నిర్వహిస్తోంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగులకు ఆధార్ జారీపై శిక్షణ ఇచ్చే పనిని ఆధార్ సంస్థ నిర్వహిస్తుండగా.. అందుకు అవసరమైన కిట్ల కొనుగోలుకు నిధులను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 60: 40 నిష్పత్తిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కో సీడీపీవో పరిధిలో మూడేసి కిట్ల లెక్కన కొనుగోలుకు రూ.26 కోట్లకు పైగా నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించాయి. ఆంధ్రప్రదేశ్‌కు రూ.6.93 కోట్లు, తెలంగాణకు రూ.4.02 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.5.94 కోట్లు, ఒడిశాకు రూ.9.12 కోట్లు ఖర్చు చేయగా.. అండమాన్ నికోబర్ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ఆశించిన స్పందన లేదని ఆధార్ అధికారులు వెల్లడిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఆ ప్రక్రియ శరవేగంగా అమలవుతోంది. అప్పుడే పుట్టిన చిన్నారుల తల్లిదండ్రులు ఆధార్ ఆధారంగా ఫొటో తీసి ఆధార్ జారీ చేస్తామని ఆ సంస్థ అధికారులు తెలిపారు.
ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగానే లబ్ధిదారులు ఆధార్ కార్డు పొందే అవకాశం ఉంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు జారీ చేసే ప్రతి ఆధార్ కార్డుకు భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ రూ.17 చొప్పున చెల్లిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఐదేళ్లలోపు ఉన్న చిన్నారులు ఏపీలో 37.7 లక్షలు ఉండగా.. అందులో 42 శాతం, తెలంగాణలో 28.8 లక్షల మంది చిన్నారులు ఉండగా.. అందులో 39 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 28.4 లక్షల మందిలో 37 శాతం, ఒడిశాలో 39.5 లక్షల మంది ఉంటే 42 శాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో 25 వేల మంది చిన్నారులు ఉంటే అందులో 58 శాతం మందికి ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను పూర్తి చేశారు.
ఆధార్ కార్డు పొందేందుకు అంగన్వాడీ సిబ్బంది అందుబాటులో లేనప్పుడు దగ్గరలోని తపాలా శాఖ, బ్యాంకుల వద్ద పూర్తి ఉచితంగా ఆధార్ పొందవచ్చని ఆధార్ సంస్థ ప్రాంతీయ కార్యాలయం తెలిపింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
