
తాజా వార్తలు
ముంబయి: బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, రణ్బీర్ కపూర్లు త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరు వచ్చే నెలలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఓ ప్రైవేటు కార్యక్రమంలో కుటుంబసభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థ కార్యక్రమం ఉండబోతోందని బాలీవుడ్ టాక్. 2020లో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ఎప్పుడో జరగాల్సి ఉంది. కాకపోతే రణ్బీర్ తండ్రి రిషీ కపూర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరు నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే ఆలియా, రణ్బీర్ స్పందించాల్సిందే. చిన్నప్పటి నుంచి తనకు రణ్బీర్ అంటే చాలా ఇష్టమని ఆలియా ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. పార్టీలకు, ఫంక్షన్లకూ ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. తాజాగా ముకేశ్ అంబానీ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లోనూ ఇద్దరూ కలిసి సందడి చేశారు.
ప్రస్తుతం ఆలియా, రణ్బీర్ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషించారు. రెండు భాగాలుగా సినిమా తెరకెక్కుతోంది. తొలి భాగం క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఎన్కౌంటర్పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
