close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

అర్హత పరీక్షలు
సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌

దేశవ్యాప్తంగా సైన్సు తత్సమాన కోర్సులకు సంబంధించి వర్సిటీలు/ కళాశాలల్లో జేఆర్‌ఎఫ్‌, లెక్చర్‌షిప్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌ అర్హతకు నిర్వహించే సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) డిసెంబరు 2019 ప్రకటన విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్ష నిర్వహిస్తోంది.
పరీక్ష నిర్వహించే విభాగాలు: కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్‌ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, మ్యాథమేటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ/ ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌-ఎంఎస్‌/ నాలుగేళ్ల బీఎస్‌/ బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.
గరిష్ఠ వయఃపరిమితి: జేఆర్‌ఎఫ్‌-28 ఏళ్లు, లెక్చర్‌షిప్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌కు పరిమితి లేదు.
పరీక్ష తేది: డిసెంబరు 15 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: అక్టోబరు 9
వెబ్‌సైట్‌: csirnet.nta.nic.in


ప్రభుత్వ ఉద్యోగాలు
నాబార్డులో డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్లు

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌-82, డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌ (హిందీ)-09.
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ, హిందీతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 2 వరకు. www.nabard.org


ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌... వివిధ విభాగాల్లో సీనియర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు:సీనియర్‌ ఆఫీసర్‌ ఖాళీలు: 48 విభాగాలు: జియాలజీ, జియోఫిజిక్స్‌, రిజర్వాయర్‌, డ్రిల్లింగ్‌, ప్రొడక్షన్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 29 ఏళ్లు మించకూడదు.
ఎంపిక:రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌/ గ్రూప్‌ టాస్క్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబరు 28 www.oil-india.com


పీజీఐఎంఈఆర్‌, చండీగఢ్‌

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌), చండీగఢ్‌... గ్రూప్‌ ఎ, గ్రూప్‌ బి, గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: ప్రిన్సిపల్‌-01, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌-01, జూనియర్‌ టెక్నీషియన్‌ (రేడియోథెరపీ)-02, ప్లాస్టర్‌ టెక్నీషియన్‌-01, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-35, సెక్యూరిటీ గార్డ్‌-25.
అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ, అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: అక్టోబరు 3 http://pgimer.edu.in/


జీఐఎస్‌ అనలిస్టులు

బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌)... దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ/ ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ జీఐఎస్‌ అనలిస్టు-20, జీఐఎస్‌ అనలిస్టు-13.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక:ార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌. చివరితేది: సెప్టెంబరు 18 వెబ్‌సైట్‌: ‌www.becil.com


మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.