close
డప్పులు, నృత్యాలతో సందడిగా స్టేడియం

హ్యూస్టన్‌: ‘హౌడీ మోదీ’ కార్యక్రమం జరగబోయే హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ ఫుట్‌బాల్‌ స్టేడియం ప్రాంగణం కోలాహలంగా మారింది. మరికొద్ది సేపట్లో కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో స్టేడియం బయట భారతీయ అమెరికన్లు పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగితేలారు. డప్పులు వాయిస్తూ నృత్యాలు చేశారు. ‘భారత్‌ మాతాకీ జై’, ‘జైహింద్‌’, ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఉత్సాహంగా భారత్‌, అమెరికా జెండాలు ఎగరేస్తున్నారు. మోదీ ఖ్యాతి ఇప్పుడు విశ్వవ్యాప్తం అయిందని ఓ వ్యక్తి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకున్నవారు స్టేడియానికి చేరుకుంటున్నారు.

మరోవైపు కార్యక్రమానికి మరికొద్దిసేపట్లో మోదీ రానున్నారు. స్వాగత బ్యానర్లు సహా, ‘సెలబ్రేటింగ్‌ ఇండియా-అమెరికా ఫ్రెండ్‌షిప్‌’ అని రాసిన బ్యానర్లను వలంటీర్లు సిద్ధం చేశారు. వీటికి సంబంధించిన వీడియోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.


వార్తలు / కథనాలు

మరిన్ని