Ala Amerikapurramuloo: తమన్‌ మ్యూజికల్‌ షో
close
Ala Amerikapurramuloo: తమన్‌ మ్యూజికల్‌ షో

హైదరాబాద్‌: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.తమన్‌ త్వరలో అమెరికాలో సంగీత ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ‘అల.. అమెరికాపురములో..’ పేరుతో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వాషింగ్టన్‌, చికాగో, న్యూజెర్సీ, శాన్‌ జోస్‌, డల్లాస్‌లో మ్యూజిక్‌ కార్నివాల్‌కు సిద్ధమవుతున్నారు. తమన్‌ వెంట సంగీత బృందంలో శివమణి, నవీన్‌, ఆండ్రియా, శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, హారికా నారాయణ్‌, శ్రుతి రంజని, మనీషా రోషిని, శాండిల్య, జోబిన్ డేవిడ్, సుభాశ్రీ, రాకేశ్ చారి, ఓషో వెంకట్, సిద్ధాంత్‌, ష‌దాబ్ రాయిన్ తదితరులు పాల్గొంటారు.

‘ఓ ప్రముఖ హీరో ఈ ప్రదర్శనలకు అతిథిగా హాజరుకానున్నారు. అలాగే పలువురు హీరోయిన్లు, దర్శకులు ఇందులో పాల్గొంటారు’ అని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోన్న హంసిని ఎంటర్‌టైన్‌మెంట్‌ పేర్కొంది. రష్యన్, బెలారస్ నృత్యకారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక కళాకారులు వారి ప్రదర్శనలతో ఈ ఈవెంట్‌ను ప్ర‌త్యేకంగా మార్చనున్నారు. వ్యాక్సిన్ ప్రాముఖ్యతను తెలియ‌జేసి అంద‌రితో క‌లిసి జీవితాన్ని ఆనందించే పాత జ్ఞాపకాలను తిరిగి తీసుకురావడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని హంసిని ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలిపింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని