keerthy suresh: కీర్తి సురేశ్‌

‘దసరా’లో వెన్నెల పాత్ర అందరినీ మెప్పిస్తుందని అంటోంది నటి కీర్తి సురేశ్‌. ఆమె కథానాయికగా నటించిన సరికొత్త చిత్రమిది. నాని కథానాయకుడిగా నటించిన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కీర్తి గురించి కొన్ని విశేషాలు..

Updated : 20 Mar 2023 17:42 IST
1/18
మలయాళీ ఫిల్మ్‌ మేకర్‌ సురేశ్‌ కుమార్‌, నటి మేనకల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ కీర్తి సురేశ్‌. మలయాళీ ఫిల్మ్‌ మేకర్‌ సురేశ్‌ కుమార్‌, నటి మేనకల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ కీర్తి సురేశ్‌.
2/18
1992 అక్టోబర్‌ 17న ఆమె చెన్నైలో జన్మించారు. విద్యను అభ్యసిస్తూనే సినిమాల్లోనూ నటించారు. 1992 అక్టోబర్‌ 17న ఆమె చెన్నైలో జన్మించారు. విద్యను అభ్యసిస్తూనే సినిమాల్లోనూ నటించారు.
3/18
ఆమె బాలనటిగా నటించిన మొదటి చిత్రం ‘పైలెట్స్‌’. ఈ సినిమాలో కీర్తి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో పలు చిత్రాల్లో ఆమెకు అవకాశాలు రావడంతో బాలనటిగా మెప్పించారు. ఆమె బాలనటిగా నటించిన మొదటి చిత్రం ‘పైలెట్స్‌’. ఈ సినిమాలో కీర్తి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో పలు చిత్రాల్లో ఆమెకు అవకాశాలు రావడంతో బాలనటిగా మెప్పించారు.
4/18
ఆమె కథానాయికగా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రం ‘మాయ’. కోలీవుడ్‌లో ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ‘మాయ’ అనంతరం కీర్తి నటించిన తొలి తెలుగు చిత్రం ‘నేను శైలజ’. ఇందులో ఆమె పాత్రకు యువత బాగా కనెక్ట్‌ అయ్యారు. అభిమానులుగా మారిపోయారు. ఆమె కథానాయికగా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రం ‘మాయ’. కోలీవుడ్‌లో ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ‘మాయ’ అనంతరం కీర్తి నటించిన తొలి తెలుగు చిత్రం ‘నేను శైలజ’. ఇందులో ఆమె పాత్రకు యువత బాగా కనెక్ట్‌ అయ్యారు. అభిమానులుగా మారిపోయారు.
5/18
కీర్తి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మహానటి’. అలనాటి నటి సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి గానూ కీర్తికి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు వరించింది. కీర్తి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మహానటి’. అలనాటి నటి సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి గానూ కీర్తికి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు వరించింది.
6/18
ఆ సినిమా విజయం తర్వాత కీర్తి వరుస కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌లో నటించి మెప్పించారు. కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో వరుస సినిమాలు చేశారు. ‘సీమ రాజా’, ‘రంగ్‌ దే’, ‘సర్కార్‌’, ‘గుడ్‌లక్‌ సఖి’ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ సినిమా విజయం తర్వాత కీర్తి వరుస కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌లో నటించి మెప్పించారు. కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో వరుస సినిమాలు చేశారు. ‘సీమ రాజా’, ‘రంగ్‌ దే’, ‘సర్కార్‌’, ‘గుడ్‌లక్‌ సఖి’ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి.
7/18
మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘సర్కారువారి పాట’ చిత్రంలో కళావతిగా నటించి మెప్పించింది. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘సర్కారువారి పాట’ చిత్రంలో కళావతిగా నటించి మెప్పించింది.
8/18
నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’లో వెన్నెలగా కనిపించనుంది. నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’లో వెన్నెలగా కనిపించనుంది.
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని