కొడాలిపై పోలీసులకు సోము వీర్రాజు ఫిర్యాదు

తాజా వార్తలు

Updated : 21/09/2020 19:48 IST

కొడాలిపై పోలీసులకు సోము వీర్రాజు ఫిర్యాదు

విజయవాడ: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను మంత్రి కించపరిచారంటూ మండిపడ్డారు. విజయవాడలోని మాచవరం పోలీస్‌స్టేషన్‌లో కొడాలి నానిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తితిదేలో అన్యమతస్థులు డిక్లరేషన్‌ ఇచ్చే అంశం ఎప్పటి నుంచో అమల్లో ఉందన్నారు. దేశంలోని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మంత్రి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దేవుని విగ్రహాలను బొమ్మలుగా వ్యాఖ్యానించడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీసినట్లేనని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని