Punjab: సిద్ధూ ప్రమాణానికి హాజరుకానున్న సీఎం
close

తాజా వార్తలు

Published : 23/07/2021 01:20 IST

Punjab: సిద్ధూ ప్రమాణానికి హాజరుకానున్న సీఎం

చండీగఢ్‌: కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌ అధ్యక్షుడిగా నవ్‌జోత్‌ సింగ్ సిద్ధూ బాధ్యతలు స్వీకరించునున్న నేపథ్యంలో శుక్రవారం నిర్వహించబోయే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ హాజరు కానున్నారు. ఆ కార్యక్రమానికి ముందు పంజాబ్‌ భవన్‌లో ఉదయం 10 గంటలకు ఆయన తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు పార్టీ నేతలు ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన మీడియా సలహాదారు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అయితే, ఈ తేనీటి విందుకు సిద్ధూ సైతం హాజరు కానున్నట్టు సమాచారం. అనంతరం వారంతా కలిసి సిద్ధూ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు.

సిద్ధూతోపాటు మరో నలుగురు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. తన ప్రమాణ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎంకు సిద్ధూ లేఖ రాశారు. తనకు సొంత అజెండా లేదని,  కేవలం ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యమని అందులో పేర్కొన్నారు. సీనియర్‌ నేతగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ సీఎంకు ఆ లేఖ ద్వారా సిద్ధూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సిద్దూ ప్రమాణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అమరీందర్‌ నిర్ణయించుకున్నారు. అయితే శుక్రవారం బాధ్యతలు చేపట్టబోయేవారితో సీఎం ముందుగానే సమావేశమయ్యారు. వారిలో సిద్ధూ లేకపోవడం గమనార్హం.

సిద్ధూ తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ అమరీందర్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పటి వరకూ సిద్ధూను కలిసేది లేదని ఆయన తేల్చి చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని