Raghurama: ఏపీలో జరగకూడని తప్పులు జరిగాయ్‌: రఘురామ

తాజా వార్తలు

Published : 02/08/2021 17:37 IST

Raghurama: ఏపీలో జరగకూడని తప్పులు జరిగాయ్‌: రఘురామ

దిల్లీ: ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆక్షేపించారు. ఏపీలో అవకతవకలు, జరగకూడని తప్పులు జరిగాయన్నారు. దిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇదే విధంగా అభివృద్ధిని పక్కనపెట్టి ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తే.. భావితరాలకు తీరని నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల విషయంలో నిబంధనల ఉల్లంఘన అంశాన్ని ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారమన్‌ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ‘‘ తప్పులు చేయకుండా అప్పులు చేయాలి. గతంలో సీఎం ఆర్థిక సలహాదారు కృష్ణ, ఆర్థిక మంత్రి బుగ్గన సీఎంకు ఇదే విషయం చెప్పారు. దాన్నే నేను మరోసారి గుర్తు చేస్తున్నాను’’ అని రఘురామ వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని