Revanth reddy: ఎస్సీలు, గిరిజనుల హక్కుల కోసం కాంగ్రెస్‌ పోరాటం: మల్లికార్జున ఖర్గే

తాజా వార్తలు

Published : 18/09/2021 01:13 IST

Revanth reddy: ఎస్సీలు, గిరిజనుల హక్కుల కోసం కాంగ్రెస్‌ పోరాటం: మల్లికార్జున ఖర్గే

గజ్వేల్‌: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు దామోదర రాజనర్సింహ, వి.హనుమంతరావు, గీతారెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏడున్నరేళ్ల తెరాస పాలనపై  కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన ఛార్జిషీట్‌ను మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ఛార్జిషీట్‌లోని అంశాలను దామోదర రాజనర్సింహ ప్రజలముందుంచారు.   ఈ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... ‘‘ ఈరోజు భారత్‌లో తెలంగాణ విలీనమైన రోజు. కానీ, అన్ని వర్గాల్లో నైరాశ్యం నెలకొంది. ఎస్సీలు, గిరిజనులు వారి హక్కుల సాధన కోసం సన్నద్ధమయ్యారు. వారి హక్కుల కోసం కాంగ్రెస్‌ బాసటగా నిలుస్తుంది. 70 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం చేసిందని మోదీ, అమిత్‌ షా ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్‌ మాత్రమే అంతా చేసినట్టు చెప్పుకుంటున్నారు. స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్‌ అన్నది మర్చిపోయారా? దేశం కోసం మా నేతలు ఎందరో ప్రాణాలర్పించారు. తెలంగాణ ఇచ్చిందే సోనియాగాంధీ. ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి పోటీ చేసి గెలిచారు’’ అని ఖర్గే అన్నారు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని