logo

‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’

మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపా ప్రభుత్వమేనని,  మాట వినకపోతే చంపేస్తానని వైకాపా నాయకుడు వడ్ల దాదాపీర్‌ వేధిస్తున్నారంటూ ప్రొద్దుటూరుకు చెందిన ఓ యువతి ఆరోపించారు.

Updated : 06 May 2024 09:11 IST

యువతికి వైకాపా నేత లైంగిక వేధింపులు
బయటకు చెబితే చంపేస్తానని బెదిరింపులు
కన్నీటి పర్యంతమవుతున్న యువతి, ఆమె తల్లి

వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు  శివప్రసాద్‌రెడ్డితో  వడ్ల దాదాపీర్‌ ఉన్న ఫొటోలు మీడియాకు  చూపుతున్న యువతి, ఆమె తల్లి

ప్రొద్దుటూరు వైద్యం, నేరవార్తలు, న్యూస్‌టుడే: మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపా ప్రభుత్వమేనని,  మాట వినకపోతే చంపేస్తానని వైకాపా నాయకుడు వడ్ల దాదాపీర్‌ వేధిస్తున్నారంటూ ప్రొద్దుటూరుకు చెందిన ఓ యువతి ఆరోపించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం తన తల్లితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. వైకాపా నాయకుడు దాదాపీర్‌ ఇంట్లో తాము నివాసం ఉండే వారమని తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనకు మాయమాటలు చెప్పి లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఎవరినీ పెళ్లి చేసుకోకూడదని బెదిరిస్తున్నారన్నారు. పెళ్లి నిశ్చయమైతే వారికి ఫొటోలు చూపించి పెళ్లి కాకుండా చేశారని ఆరోపించారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరిస్తున్నారన్నారు. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసి మరో వీధిలో చేరినా అతడి వేధింపులు ఆగలేదన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపా ప్రభుత్వమేనని, విషయం బయటకొస్తే చంపేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితో వడ్ల దాదాపీర్‌ ఉన్న ఫొటోలు మీడియాకు చూపారు. దాదాపీర్‌ నుంచి తమకు ప్రాణహాని ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయమై బాధితురాలు న్యాయం కోరుతూ స్థానిక వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని