ఎడ్లబండి పైనుంచి పడిన రాజనర్సింహ

తాజా వార్తలు

Published : 12/07/2021 14:21 IST

ఎడ్లబండి పైనుంచి పడిన రాజనర్సింహ

మెదక్‌: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై మెదక్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎడ్ల బండి పైనుంచి జారి కిందపడ్డారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఎద్దులు బెదరడంతో అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో రాజనర్సింహ మోకాలికి స్వల్ప గాయమైంది. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని