సాగర్‌ పోరు..వామపక్షాల మద్దతుకోరిన కాంగ్రెస్‌

తాజా వార్తలు

Published : 29/03/2021 01:26 IST

సాగర్‌ పోరు..వామపక్షాల మద్దతుకోరిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌: నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో తమ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ప్రకటించాలని కోరుతూ వామపక్ష పార్టీలకు లేఖలు రాసినట్లు కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖలు రాశారు. ఫోన్‌లో కూడా వారితో మాట్లాడినట్టు నేతలు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఆయా పార్టీల నేతలతో చర్చలు జరిపే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని