నన్ను ఉగ్రవాది అనడం విచారకరం: కేజ్రీవాల్‌

తాజా వార్తలు

Published : 29/01/2020 16:56 IST

నన్ను ఉగ్రవాది అనడం విచారకరం: కేజ్రీవాల్‌

దిల్లీ: ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ హస్తినలో రాజకీయం మరింత వేడెక్కింది. అధికార, విపక్ష పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో మాటలకు పదును పెడుతూ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల కొందరు రాజకీయ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతూ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరతీస్తున్నారు. ఈ నేపథ్యంలో భాజపా ఎంపీ పర్వేశ్‌ వర్మ తనను ఉగ్రవాదిగా సంబోధించడంపై దిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ట్విటర్‌లో స్పందించారు. ప్రజలకు సహాయం చేసేందుకు తాను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. భాజపా ఎంపీ పర్వేశ్‌ వర్మ తనను ఉగ్రవాదిగా పిలిచినట్టు మీడియాలో ప్రచురితమైన వార్తను బుధవారం కేజ్రీవాల్‌ ట్విటర్‌లో జత చేస్తూ తనదైన శైలిలో జవాబిచ్చారు. ‘‘ప్రజల సంక్షేమం కోసం  రాత్రింబవళ్లు కష్టపడుతున్నా. దిల్లీ ప్రజల కోసం అన్నీ వదులుకున్నా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు అనేక కష్టాలు పడ్డాను. కానీ ఈ రోజు భాజపా నన్ను ఉగ్రవాది అంటోంది. ఇది చాలా విచారకరం’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు, దిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీలు అనురాగ్ ఠాకూర్‌, పర్వేశ్‌ వర్మలను భాజపా ప్రచార తారల జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని