కేజ్రీవాల్‌ ఉగ్రవాదే.. ఆధారాలున్నాయ్‌: జావడేకర్‌

తాజా వార్తలు

Published : 03/02/2020 17:28 IST

కేజ్రీవాల్‌ ఉగ్రవాదే.. ఆధారాలున్నాయ్‌: జావడేకర్‌

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో కేజ్రీవాల్‌ తనకు తాను అరాచకవాదినని చెప్పుకున్నారని.. ఉగ్రవాదికి, అరాచకవాదికి పెద్ద తేడా లేదని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ను ‘ఉగ్రవాది’గా పేర్కొన్నందుకు దిల్లీ భాజపా ఎంపీపర్వేష్‌ వర్మ ప్రచారంపై ఈసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఉగ్రవాదే అనడానికి తగిన ఆధారాలున్నాయని జావడేకర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు.

‘‘పంజాబ్‌ ఎన్నికల సమయంలో ఖలిస్థాన్‌ కమాండో ఫోర్స్‌ చీఫ్‌ గురీందర్‌ సింగ్‌ నివాసంలో మీరు (కేజ్రీవాల్‌) ఉన్నమాట వాస్తవం కాదా? అదో ఉగ్రవాది ఇల్లని మీకూ తెలుసు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? అయినా ‘నేను ఉగ్రవాదినా?’ అని అమాయకంగా అడుగుతారు. గతంలో మీరే ఓసారి ‘నేనో అరాచకవాదిని’ అని చెప్పుకున్నారు. ఉగ్రవాదికి, అరాచకవాదికి పెద్ద తేడా లేదు’’ అని జావడేకర్‌ అన్నారు. షాహిన్‌బాగ్‌ ఆందోళనలకు ఆప్‌ మద్దతిస్తోందని జావడేకర్‌ ఆరోపించారు. జేఎన్‌యూలో జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిపైనా విచారణ జరగకుండా కేజ్రీవాల్‌ అడ్డుకున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్‌ అసత్యాలకు పెట్టింది పేరని, ఉగ్రవాదుల పట్ల సానుభూతి ఉన్నవారని దిల్లీ వాసులు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ‘‘షాహిన్‌బాగ్‌, జేఎన్‌యూ వంటి అరాచకవాదులకు మద్దతిచ్చే మీరు నిజంగా ఓ ఉగ్రవాదే’’ అని జావడేకర్‌ ఆరోపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని